Chennai, December 22: సౌత్ ఫిల్మ్‌ఫేర్ 66వ అవార్డుల ప్రధానోత్సవం(66th Yamaha Fascino Filmfare Awards South) శనివారం చెన్నైలోని ( Chennai) జవహర్‌లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. 2018 ఏడాదికిగానూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యుతమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల నుంచి పలువురు నటీనటులు హాజరయ్యారు.
తెలుగులో ఉత్తమ చిత్రంగా మహానటి (Mahanati) ఎంపికైంది. అలాగే మహానటి, రంగస్థలం (Rangasthalam) చిత్రాలు పలు విభాగాల్లో సత్తా చాటాయి. రంగస్థలం చిత్రానికి సంబంధించి రామ్‌చరణ్ (Ram Charan)ఉత్తమ నటుడిగా, మహానటి కీర్తి సురేశ్ (Keerthi Suresh)ఉత్తమ నటిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. అరవింద సమేత చిత్రానికి గానూ జగపతిబాబు ఉత్తమ సహాయనటుడిగా అవార్డు దక్కించుకున్నారు.
తెలుగు సినిమాలకు వచ్చిన అవార్డులు ఇవే
ఉత్తమ చిత్రం - మహానటి
ఉత్తమ దర్శకుడు - నాగ్ అశ్విన్ (మహానటి)
ఉత్తమ నటుడు - రామ్‌చరణ్ (రంగస్థలం)
ఉత్తమ నటి - కీర్తి సురేశ్ ( మహానటి)
ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - దుల్కర్ సల్మాన్ (మహానటి)
ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రష్మిక మందన్న (గీతా గోవిందం)
ఉత్తమ సహాయ నటి - అససూయ భరద్వాజ్ (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు - జగపతిబాబు (అరవింద సమేత)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ మ్యూజిక్ అల్బమ్ - దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత - చంద్రబోస్(ఎంత సక్కగున్నావే- రంగస్థలం)
ఉత్తమ నేపథ్య గాయకుడు - సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే- గీత గోవిందం)
ఉత్తమ నేపథ్య గాయని - శ్రేయా ఘోషాల్ (మందరా మందరా-భాగమతి)