ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలియజేశారు. నిన్న వ్యాక్సిన్ తీసుకున్నట్టు (Nagarjuna COVID-19 vaccine) ఆయన వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం పేర్లను నమోదు చేయించుకోవాలని చెప్పారు.
హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. మరోవైపు నాగార్జున తాజా చిత్రం 'వైల్డ్ డాగ్' సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక సినిమాకు కొత్తదనంతో కూడిన కథాంశాలను ప్రేక్షకులకు అందించడంలో టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య ముందుంటాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో చైతు నటిస్తోన్న లవ్‌స్టోరీ ఏప్రిల్ లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ యువ నటుడు బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌తో యాడ్ షూట్‌లో పాల్గొన్నాడు. ఈ ఇద్దరూ కలిసి యాడ్ షూట్ లొకేషన్ లో సెల్ఫీ దిగారు.
Here's Nagarjuna Akkineni Tweet
Got my #covaxin jab yesterday .. absolutely no down time👍😊I urge whoever is eligible to take the vaccine!!
You can now register for your #Covid19vaccine at https://t.co/Rm3ZUrv1Kx Book your vaccine. and get it done! #Unite2FightCorona#VaccineVarta@MoHFW_India @BMGFIndia pic.twitter.com/B4wjGoKLjx
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2021
రెడ్ ట్రాక్ షూట్‌లో ఉన్న చైతూ డైరెక్టర్ ఫరాఖాన్‌తో దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చధా చిత్రంలో నాగచైతన్య కీ రోల్ చేస్తున్నట్టు వార్తలు రాగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే చైతూ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.