తమిళ నటుడు, సీనియర్ హీరో శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనతో పాటుగా భార్య రాధిక, కూమార్తె వరలక్ష్మి సైతం ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఈ సమాచారం తెలియగానే పలువురు కోలీవుడ్ ప్రముఖులు శరత్ కుమార్ ను పరామర్శించేందుకు ఆసుపత్రికి వస్తున్నారు. ఆయన రెండు రోజులుగా అతిసార వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా డయేరియా కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యారని వైద్యులు తెలిపారు.
ఫోన్ లో గేమ్ ఆడుతుండగా ఒక్కసారిగా పేలిన మొబైల్.. 13 ఏండ్ల బాలుడికి తీవ్ర గాయాలు.. మథురలో ఘటన
శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా శరత్‌కుమార్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.