Actors Sarathkumar and Radhika (Photo-Facebook)

తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్‌, అతడి భార్య, నటి, నిర్మాత రాధికలకు (Actors Sarathkumar and Radhika) ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. 2018 నాటి చెక్‌ బౌన్స్‌ కేసులో (Cheque Bounce Case) ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష (get one-year jail term) విధిస్తూ తీర్పునిచ్చింది.ఈ కేసుకు సంబంధించి రూ .5 కోట్ల జరిమానా కూడా కోర్టు విధించింది.

వివరాల్లోకి వెళితే.. 2015లో 'ఇదు ఎన్న మాయం' సినిమా కోసం రాధికా, శరత్‌కుమార్‌లు రేడియంట్‌ గ్రూప్‌ అనే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. అయితే సకాలంలో ఆ అప్పును తీర్చలేదు. తర్వాత వీరు ఇచ్చిన చెక్‌ కాస్తా బౌన్స్‌ అయింది. దీంతో రేడియంట్‌ గ్రూప్‌ 2018లో కోర్టును ఆశ్రయించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం చెన్నై స్పెషల్‌ కోర్టు ఈ దంపతులకు జైలు శిక్ష విధిస్తున్నట్లు తాజాగా తీర్పు వెలువరించింది.

శరత్‌కుమార్, రాధిక, లిస్టిన్ స్టీఫెన్ భాగస్వాములుగా ఉన్న మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థ..సినిమా కోసం రేడియన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ రూ .1.50 కోట్లు అప్పుగా తీసుకుంది. ఇందుకు ప్రతిఫలంగా ఈ కంపెనీ రెండు చెక్కులను వారికి జారీ చేసింది. దీని తర్వాత రేడియన్స్ మీడియా నుంచి శరత్ కుమార్ రూ .50 లక్షలు రుణం తీసుకున్నారు. దీనికి ప్రతిగా అతను రూ .10 లక్షలకు ఐదు చెక్కులు జారీ చేశాడు. వాటిని బ్యాంకులో వేయగా అవి బౌన్స్ అయ్యాయి.

ఈ రోజు నేను చచ్చిన రోజు, పుట్టిన రోజు కాదు, ఏడుస్తున్న ఎమోజీలతో ట్వీట్ చేసిన వర్మ, ఫన్నీగా కామెంట్స్ పెడుతున్న అభిమానులు 

అంతకుముందు, సైదాపేట ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తమపై ప్రారంభించిన క్రిమినల్ చర్యలను సవాలు చేస్తూ దంపతులిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. 2019 మేలో, శరత్‌కుమార్, రాధిక మరో ఇద్దరిపై పెండింగ్‌లో ఉన్న రెండు చెక్ బౌన్స్ కేసుల్లో నేరారోపణలను రద్దు చేయడానికి జస్టిస్ జికె ఇలంతిరయ్యన్ నిరాకరించారు. విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని న్యాయమూర్తి సైదాపేటలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఆదేశాలు జారీ చేశారు.

ఈలోగా, ఈ కేసును చెన్నై కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని ఎంపీ / ఎమ్మెల్యేల కోసం కేటాయించిన ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. బుధవారం, న్యాయమూర్తి ఎన్ అలిసియా ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ జంటకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు.