Hyderabad, May 06: టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ స్టేటస్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్‌కు (Rakul Preet Singh) ఇప్పుడు అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి. తెలుగులో అవకాశాలు తగ్గుతుండటంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన ఈ ఢిల్లీ భామ.. అక్కడ వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. అదే టైమ్‌లో ఫ్యాన్స్‌కు దూరం కాకుండా ఉండేందుకు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా పోస్టు చేసిన ఓ బికినీ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) రకుల్ ప్రీత్ సింగ్ పోస్టు చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఆమె ఎక్స్‌పోజింగ్ కంటే కూడా ఆమె చేసిన ఫీట్. గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అంతలా ఏం సాహసం చేసిందని అనుకుంటున్నారా? మైనస్ 15 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో ఐస్ బాత్ చేసింది.
View this post on Instagram
ఓ కట్టెల ఇంటిలో నుంచి బికినీలో (Rakul Preet Singh Bikini) నడుచుకుంటూ వచ్చిన రకుల్.. అక్కడే గడ్డకట్టిన మంచు మధ్యలో ఉన్న నీటిలో కాసేపు మునిగింది. ఆ తర్వాత నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. రకుల్ షేర్ చేసిన ఈ వీడియోను చూసిన అభిమానులు అవాక్కవుతున్నారు. అంతటి గడ్డకట్టే చలిలో అలా బికినీలో ఐస్ బాత్ చేయడం నిజంగా సాహసమే అంటూ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.
మరికొందరు నెటిజన్లు అయితే.. అసలు రకుల్ అంత గడ్డ కట్టే చలిలో ఎందుకంత సాహసం చేసిందని చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి తమకు తెలిసిన ఓ సమాధానం కూడా చెబుతున్నారు. రకుల్ పోస్టు చేసిన వీడియోలో క్రియో ఇన్ మైనస్ 15 డిగ్రీస్ అని పోస్టు చేసింది. దీంతో రకుల్ క్రియోథెరపీ చేయించుకుంటుందని.. అందుకే ఇంతటి చలిలో ఈ ఫీట్ చేసిందని అనుకుంటున్నారు.