Akhanda trailer: దుమ్మురేపుతున్న అఖండ ట్రైలర్, పంచ్‌ డైలాగ్‌లతో విశ్వరూపం చూపిన బాలయ్య, అఘోరాగా బాలయ్య లుక్స్ కేక

Hyderabad November 14: నందమూరి బాలకృష్ణ మరోసారి విశ్వరూపం చూపించారు. నటసింహం బాలయ్య, లెజెండ్రీ డైరక్టర్ బోయపాటి శ్రీని కాంబినేషపన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండకు సంబంధించిన ట్రైలర్‌ దుమ్మురేపుతోంది.

ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పైగా అఘోరాగా కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై హైప్స్ పెరిగిపోయాయి. అఖండ ఫస్ట్ లుక్, సాంగ్ ప్రోమో వంటివాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన అఖండ్ ట్రైరల్ దుమ్మురేపుతోంది. అఖండ రోర్‌ పేరుతో ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీ టీం.

బాలకృష్ణ అభిమానులు కోరుకునే అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. సినిమాపై ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా ఉంది.

బాలకృష్ణ లుక్స్‌, ఆయన చెప్పిన డైలాగ్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్‌ సందడి చేయనుంది. జగపతిబాబు, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్స్‌ ఫ్యాన్స్ ను కేక పెట్టిస్తున్నాయి.