Credits: Facebook

Hyderabad, Nov 13: సంగీత (Sangitha), తిరువీర్ (Tiruveer), కావ్య కల్యాణ్ రామ్ (Kavya Kalyanram), శుభలేఖ సుధాకర్ ప్రధానపాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'మసూద(Masooda). స్వధర్మ్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ లో వస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి సాయికిరణ్ (Sai Kiran) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని, చాలా ఆసక్తి రేకెత్తిస్తోందని విజయ్ దేవరకొండ తెలిపారు. ట్రైలర్ ను ఆకట్టుకునేలా రూపొందించారని, యావత్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

విశాఖ బీచ్ లో పవన్ కల్యాణ్ షికారు... ఫొటోలు వైరల్.. విశాఖ పర్యటనకు వచ్చిన జనసేనాని.. ప్రధాని మోదీతో భేటీ.. నిన్న రుషికొండ పనులను పరిశీలించిన వైనం.. అనంతరం బీచ్ లో పర్యటన

'మసూద' యూనిట్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా కొత్త కథలు, కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ముందున్నాడని, ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.