Danny Masterson Rape Case: అమ్మాయిలపై అత్యాచారం, ప్రముఖ నటుడు డానీ మాస్టర్‌సన్‌కు 30 ఏళ్ళు జైలు శిక్ష, కోర్టులో భోరున ఏడ్చేసిన అతని భార్య
Danny Masterson (Photo Credits: PTI)

రెండు అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న That 70s Show నటుడు డానీ మాస్టర్‌సన్‌ను న్యాయస్థానం నిందితుడిగా తేల్చింది. యువతులపై అత్యాచారానికి పాల్పడినందుకుగానూ అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 2001లో 23 ఏళ్ల యువతిపై, 2003లో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడగా, 2003 చివర్లో 23 ఏళ్ల మరో యువతిని ఇంటికి పిలిచి మరీ అత్యాచారం చేసినట్లు కేసులు నమోదయ్యాయి.

దీనిపై 2020 జూన్‌లో విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు జైలు శిక్ష విధించగా.. 3.3 మిలియన్‌ డాలర్లు చెల్లించి అదే రోజు జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా మరోమారు విచారణ జరగ్గా డానీ మాస్టర్‌సన్‌ను నిందితుడిగా తేల్చిన న్యాయస్థానం 30 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

జూన్‌ 9న లావణ్య త్రిపాఠితో వరుణ్‌ తేజ్‌ ఎంగేజ్మెంట్‌, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు

న్యాయస్థానం తీర్పు ప్రకటించిన సమయంలో డానీ మౌనంగా ఉండిపోగా ఆయన భార్య, నటి బిజు ఫిలిప్స్‌ మాత్రం కోర్టులోనే బోరుమని ఏడ్చేసింది.లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ 2017లో ద రాంచ్‌ అనే కామెడీ షో నుంచి డానీ మాస్టర్‌సన్‌ను తొలగించింది.