#BoycottPushpaInKarnataka: విడుదలకు ముందే పుష్పకు కర్ఱాటకలో భారీ షాక్, ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న #BoycottPushpainKarnataka, తమ భాషలోనే సినిమాను విడుదల చేయాలని డిమాండ్
Allu Arjun in Pushpa Song Daakko Daakko Meka (Photo Credits: YouTube Still)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదలవుతున్న సంగతి విదితమే. అయితే ఈసినిమాకు కర్ణాటకలో ఊహించని షాక్ తగిలింది. సోషల్ మీడియాలోపుష్ప బ్యాన్ అంటూ రచ్చ కన్నడిగులు చేస్తున్నారు. ట్విట్టర్లో ఇప్పుడు #BoycottPushpainKarnataka ట్రెండింగ్‌లో ఉండటం పుష్ప మేకర్స్ ను, అభిమానులను టెన్షన్ లో పెట్టే విషయం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కర్ణాటకలో (Karnataka) బహిష్కరించాలని కోరుతూ అక్కడి ప్రజలు ఈరోజు ఉదయం నుంచి స్పెషల్ హ్యాష్‌ట్యాగ్ ను (Boycott Pushpa In Karnataka) ట్రెండ్ చేస్తున్నారు.

కన్నడిగులు ఆగ్రహానికి కారణం ఏమిటంటే… ఈ కర్ణాటకలో ఈ చిత్రం (Pushpa) కన్నడ వెర్షన్ కంటే ఎక్కువగా తెలుగులోనే విడుదల అవుతుండడం. అక్కడ తెలుగు వెర్షన్‌తో పోలిస్తే తక్కువ సంఖ్యలో కన్నడ వెర్షన్ ను విడుదల చేస్తున్నారట. దీంతో తమ రాష్ట్రంలో తమ భాషకు ప్రాధాన్యతను ఇవ్వకుండా ఇతర భాషల్లో ఎలా రిలీజ్ చేస్తారు ? అంటూ మేకర్స్ ను ప్రశ్నిస్తున్నారు. కన్నడ కాకుండా తెలుగు వెర్షన్ రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాలలో విడుదల కావడం ప్రాంతీయవాదులకు ఏమాత్రం నచ్చలేదు.

See Trending Tweets

దీంతో కర్ణాటకలోని అల్లు అర్జున్ అభిమానులు… ఈ చిత్రాన్ని బహిష్కరించమంటున్నాం అంటే తెలుగుకు, లేదా సినిమాకు తాము వ్యతిరేకం కాదని, కానీ తమ రాష్ట్రంలో తమ భాషకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ‘తగ్గేదే లే’ అంటూ ట్రెండింగ్ లోకి వచ్చారు.