Hyderabad, FEB 24: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) వచ్చే నెల 1 నుంచి 3 వరకు రెండో దశ సెలబ్రెటీ క్రికెట్ లీగ్ పోటీలు (Celebrity Cricket League) జరగనున్నాయి. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు తెలిపారు. సీసీఎల్ (CCL) తొలి దశ మ్యాచ్‌లు షార్జాలో జరుగుతున్నాయి. సీసీఎల్ లీగ్‌లో బాలీవుడ్ (Bollywood), టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు దేశంలోని పలువురు సినీ ప్రముఖులు, తారలు ఆడుతున్నారు. వారంతా హైదరాబాద్ వస్తారని జగన్ మోహన్ రావు తెలిపారు. తెలంగాణలోని కాలేజీ విద్యార్థులకు ఉచితంగా సీసీఎల్ చూసే అవకాశం ఉంది.
Your Favourite Celebrities Stand Tall with the Iconic CCL Trophy! 🌟🏆#CCL2024 starts from February 23rd and will be Live on JioCinema and Sony Ten 5.#A23 #Parle2020 #CCLSeason10 #DanubeCCLUAE #TruckersUAE #CCLUAE #Chalosaathkhelein #CCLonJioCinema #CelebrityCricketLeague… pic.twitter.com/WxuJGwnzNQ
— CCL (@ccl) February 23, 2024
రోజుకు పది వేల మంది ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులను స్టేడియంలోకి ఉచితంగా అనుమతిస్తామని తెలిపారు. ఆయా కాలేజీ ప్రిన్సిపాల్స్ హెచ్‌సీఏ ఈమెయిల్ hca.ccl2024@gmail.comకు తమ విద్యాసంస్థల నుంచి ఎంత మంది వస్తున్నారో విద్యార్థుల పేర్లతో సహా ఈమెయిల్ చేయాలని సూచించారు.
స్క్రూట్నీ తర్వాత తమ సిబ్బంది కాలేజీలకు రిప్లై ఇస్తారని తెలిపారు. హైదరాబాద్‌లో 6 మ్యాచ్‌లు జరగనున్నాయి. యంగ్ హీరో అక్కినేని అఖిల్ (Akhil) సారథ్యంలోని టాలీవుడ్ టీమ్ తెలుగు వారియర్స్ కూడా ఆడుతోంది. రోజుకు రెండు మ్యాచ్‌లు చొప్పన 3 రోజులు 6 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.
పాల్గొనే జట్లు
ముంబై హీరోస్
కేరళ స్ట్రయికర్స్
భోజ్‌పురి దబాంగ్స్
బెంగాల్ టైగర్స్
చెన్నై రైనోస్
కర్ణాటక బుల్డోజర్స్
పంజాబ్ డి షేర్