RGV says, It's pointless to ask brutal punishment for Hyderabad Vet's rapists and murderers (Photo-Twitter)

ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానిని కలువాలనుకుంటున్నానని ట్విట్టర్లో దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఆయన వరుస ట్వీట్‌లు చేస్తూ.. ‘పేర్ని నాని (minister Perni Nani) గారు ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలి అన్నది మా ఉద్దేశం కాదు.. పర్సనల్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే నాకు చాలా అభిమానం. కేవలం మా సమస్యలు మేము సరిగా చెప్పుకోలేక పోవడం వల్లనో లేక , మీరు మా కోణం నుంచి అర్థం చేసుకోకపోవడం వల్లలో ఈ మిస్ అండర్ స్టాండింగ్ ఏర్పడింది’ అంటూ ట్వీటర్‌లో రాసుకొచ్చారు.

దీనికి కంటిన్యూగా వర్మ మరో ట్వీట్‌ చేస్తూ.. ‘కాబట్టి పేర్ని నాని గారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని కలిసి ఇండస్ట్రీ తరపు నుంచి మా సమస్యలకు (Cinema Industry Problems) సంబంధించిన వివరణ ఇస్తాను. అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను’ అంటూ వర్మ ట్వీట్‌ చేశారు.

Here's Ram Gopal Varma Tweets

వర్మ ట్వీట్‌కి మంత్రి పేర్నీ నాని రిప్లై ఇస్తూ .. ‘ధన్యవాదాలు రామ్‌ గోపాల్‌ వర్మ గారు.. తప్పకుండ త్వరలో కలుద్దాం’ అని ట్వీట్‌ చేశారు.