Committee Kurrollu In OTT

Hyderabad, OCT 06: నూతన నటీనటులతో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేసిన సినిమా కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu). ఈ చిత్రాన్ని టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో యదువంశీ డైరెక్ట్ చేశాడు. శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై పద్మజా కొణిదెల, జయలక్ష్మి తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్టు 9న విడుదలై సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది.

Nagarjun Shiva Movie: శివ సినిమా విడుదలై 35 సంవత్సరాలు, రామ్ గోపాల్ వర్మకు కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున, నాన్నగారి మాటలను గుర్తుచేసుకున్న కింగ్ 

ఓట్లు కొనేసిన తర్వాత ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ, గొర్రెల్లా కాకుండా మంచి చెడులను విశ్లేషించుకొని ఓటు వేయాలనే సందేశంతో రూపొందించిన ఈ చిత్రం కోట్లాదిమంది మనసు దోచుకోవడమే కాదు.. ప్రతిష్టాత్మక అవార్డును అందుకోబోతుంది. కమిటీ కుర్రోళ్లు సినిమా (Committee Kurrollu) దాదా సాహెబ్‌ ఫాల్కే ఎంఎస్‌కే ట్రస్ట్‌- ఇన్నోవేటివ్‌ ఫిల్మ్‌ అకాడమీ అసోసియేషన్‌తో కలిసి అందించే మాస్టర్‌ పీస్‌ ఆఫ్‌ తెలుగు సినిమా-2024 అవార్డుకు ఎంపికైంది.

Here's the Tweet

 

 

తొలి సినిమాతో అవార్డు కైవసం చేసుకుని.. అప్‌కమింగ్ యాక్టర్లు, దర్శకుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు కమిటీ కుర్రోళ్లు. ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సందీప్ సరోజ్, యస్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్ రాధ్యా, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విషిక కీలక పాత్రల్లో నటించారు.