తెలుగు చలన చిత్రసీమలో శివ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. టాలీవుడ్ లో శివ సినిమాకు ముందు, శివ సినిమాకు తర్వాత అనేలా ఆ సినిమా ప్రభంజనం సృష్టించింది. సరిగ్గా ఇవాళ్టికి (అక్టోబరు 6) శివ సినిమా విడుదలై 35 సంవత్సరాలైందంటూ... టాలీవుడ్ కింగ్ నాగార్జున స్పందించారు. "ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు గారు, నేను కార్లో వెళుతున్నాం. నిన్న రాత్రి శివ సినిమా చూశాను... ఆ సినిమా పెద్ద హిట్ అంటూ ఈ ఉదయం అందరూ చెప్పుకుంటుంటే విన్నాను... కానీ ఆ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచిపోతుందని నాకనిపిస్తోంది అని మా నాన్న నాతో అన్నారు. నిజంగా అద్భుతం నాన్నా... ఆనాడు నీ మాటలు నిజమయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా శివ సినిమాను అభిమానిస్తున్న వాళ్లకు ధన్యవాదాలు. శివ సినిమా రూపొందడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ... ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
ఈసారి హోస్ట్‌గా విజయ్ సేతుపతి, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న తమిళ బిగ్ బాస్..వివరాలివే
Here's Tweet
It’s been 35 years and a day since the release of the iconic #shiva!!
I cannot forget that day driving in a car with my father Anr garu and he said ‘I saw shiva last night and this morning I heard it’s a big hit, but I believe it will become one of the biggest…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)