Adipurush (Photo Credits: Youtube Screenshot)

Hyderabad, October 9: ప్రభాస్ (Prabhas) రాముడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ (Adipurush) మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో (Court)  పిటిషన్ దాఖలైంది. ఈ సినిమా టీజర్ ను (Teaser) యూట్యూబ్ (Youtube) తదితర వేదికల నుంచి తొలగించాలని, సినిమా విడుదలపై స్టే (Stay) విధించాలని ఆ పిటిషన్ లో కోరారు. ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut), నిర్మాత భూషణ్ కుమార్ (Bhushan Kumar) లకు వ్యతిరేకంగా రాజ గౌరవ్ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. ఆదిపురుష్ టీజర్ లో రాముడ్ని, ఆంజనేయుడ్ని అసంబద్ధంగా చూపించారని ఆరోపించారు. వారు తోలు పట్టీలతో కూడిన దుస్తుల్లో ఉన్నట్టుగా టీజర్ లో కనిపిస్తోందని వివరించారు.

అలాంటి సందర్భాలను రేప్ గా పరిగణించలేం.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

ఇక, రావణుడ్ని చాలా చవకబారుగా చూపించారని పేర్కొన్నారు. మోడ్రన్ హెయిర్ స్టయిల్, చెవులపై బ్లేడ్ సింబల్స్ తో రావణుడ్ని చిత్రీకరించారని పిటిషనర్ వివరించారు. మొఘల్ చక్రవర్తుల పూర్వీకుడిలా కనిపిస్తున్న రావణుడు గబ్బిలంపై స్వారీ చేస్తున్న దృశ్యాలు కూడా టీజర్ లో ఉన్నాయని తెలిపారు.  శివభక్తుడైన రావణుడికి మీసాలు ఉంటాయని, తలపై నిత్యం బంగారు కిరీటం ఉంటుందని వివరించారు. రావణుడి వాహనం పుష్పక విమానం అని వెల్లడించారు. ఆదిపురుష్ టీజర్ హిందువుల మత విశ్వాసాలను, సంస్కృతి, చరిత్ర, నాగరికతలను దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు.