సాధారణంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. అవకాశాల పేరిట ఎంతో మంది హీరోయిన్లను లొంగదీసుకుని వారి జీవితాలను నాశనం చేశారు. అలాంటి వారినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు.. అయితే మరి కొంతమంది హీరోలు, నిర్మాతలు, దర్శకులు అడగకపోయినా పడక సుఖం అందించిన కొంత మంది హీరోయిన్ల వీడియోలు, స్క్రీన్ షాట్ లు తన దగ్గర ఉన్నాయి అంటూ వారి వ్యభిచార వ్యవహారాన్ని బయటపెట్టింది ప్రముఖ హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా.
69 సంస్కార్ కాలనీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా. టీనేజ్ అబ్బాయికి హౌస్ వైఫ్‌కి మధ్య చిగురించిన ప్రేమ కథతో ఈ చిత్రాన్ని బోల్డ్‌గా రూపొందించారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. టీజర్, ట్రైలర్‌లతో హీరోయిన్ ఎస్తేర్‌ను ఓ రేంజ్‌లో చూపించారు దర్శకుడు. ఈ చిత్రం పలు వాయిదాల అనంతరం మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
ప్రముఖ ర్యాప్ సింగర్ నోయల్ ను వివాహం చేసుకొని కేవలం మూడూ నెలల వ్యవధిలోనే పరస్పర విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు లో భీమవరం బుల్లోడు, వెయ్యి అబద్ధాలు, జయ జానకి నాయిక, గరం వంటి చిత్రాల్లో కనిపించినా ఆమె పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు మన తెలుగు దర్శకులు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం పిలిచి మరీ పడక ఆఫర్లు ఇచ్చే హీరోయిన్లు కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్లను కూడా నేను చూశాను. ఆఫర్ ఇస్తే ఏదైనా చేయడానికి నేను రెడీ అని నాతో చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారు.
మగాళ్లు అడగటం ఒకటైతే ఆడాళ్లు ఆఫర్ చేయడం అనేది కూడా ఇండస్ట్రీలో ఉంది. అడగలేనప్పుడు ఆఫర్ చేస్తారు.. ఆఫర్ చేయలేనప్పుడు అడుగుతారు. 99 శాతం మంది అలాగే చేస్తున్నప్పుడు మిగిలిన ఆ ఒక్కశాతాన్ని అందులో కలిపేస్తారు.. నువ్వు కూడా అంతేలే అనేస్తారు. ఈరోజు వద్దంటావ్.. రేపు వద్దంటావ్.. ఓ రెండేళ్ల తరువాత వద్దంటావ్.. కానీ ఏదో రోజు కావాలని వస్తావ్ కదా.. అంటూ చాలా అసహ్యంగా మాట్లాడుతారు అని ఆమె స్పష్టం చేసింది.