స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన 'అల వైకుంఠపురములో' (Ala Vaikunthapurramuloo ) సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతకన్నా ముందు ఈ సినిమాలోని పాటలు బ్లాక్‌బస్టర్ గా నిలిచాయి. అయితే సినిమా ఆడియోకి సంబంధించి మేకర్స్ ఒక విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారు, ఆ సస్పెన్స్ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌గా అనిపిస్తుంది. ఆ సర్‌ప్రైజ్ పేరే 'సిత్తరాల సిరపడు' ( Sittharala Sirapadu) అనే పాట.
ఒక ఫైటింగ్ సన్నివేశంలో సందర్భానికి తగినట్లు, పాటలోని సాహిత్యానికి తగినట్లుగా రౌడీలను హీరో స్టైలిష్‌గా కొడుతుండగా శ్రీకాకుళం జానపదంతో బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అయ్యే 'సిత్తరాల సిరపడు' పాట సినిమాకే హైలైట్. జానపద గాయకుడు సూరన్న, సాకేత్ కోమండూరి పాడి ఈ పాటలో ఒక సోమరితనంగా సాగే టెంపో, మాస్ పదాల అల్లికలు, థమన్ మ్యూజిక్ కంపోజిషన్ ఆ ఫైటింగ్ సన్నివేశాన్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్లింది. అల వైకుంఠపురములో- సరిలేరు నీకెవ్వరు టూ-ఇన్-వన్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రౌడీలను ఓ స్టైలిష్ హీరో తడిగుడ్డతో 'హలాల్' కట్ చేస్తున్నట్లుగా , చూస్తున్న ప్రేక్షకులకు స్లో పాయిజన్‌లా మెల్లగా మత్తెకుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ పాట అల వైకుంఠపురములో మ్యూజిక్ ఆల్బమ్ విలువ మరింత పెంచుతోంది.
#AlaVaikunthapurramuloo - Sittharala Sirapadu:
ఒకానొక దశలో జానపదాలకు ఆదరణ తగ్గిపోయిన వేళ, యూట్యూబ్ ద్వారా ఆ జానపదాలు మళ్ళీ జీవం పోసుకొని ఇటీవల కాలంలో సంచనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు అలా వైకుంఠపురములో సినిమాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన రెండు పాటలు జానపదాలు కావడం విశేషం. ఒకటి శ్రీకాకుళం టచ్‌తో సాగే జానపదం 'సితరాల సిరపడు' కాగా, ఇంకోటి కరీంనగర్ జానపదం డిజే మిక్స్ 'రాములో... రాములా' .
ఇక 'అలా వైకుంఠపురములో' హిట్ తో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లయింది.