Most Searched Movies 2023: షారుక్ ఖాన్ కు తెగ క‌లిసి వ‌చ్చిన 2023, గూగుల్ సెర్చ్ తో బాలీవుడ్ బాద్ షా హ‌వా, ఈ సంవ‌త్స‌రం నెటిజ‌న్లు తెగ వెతికిన టాప్-10 సినిమాలివే!
Jawan Prevue (Photo Credits: YouTube)

New Delhi, DEC 13: ఇంకా కొద్దిరోజులే! మరో 20 రోజుల్లో పాత సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం (New Year) ప్రారంభం కాబోతుంది. దీంతో న్యూఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు అంతా సిద్ధమవుతున్నారు. అదే సమయంలో పాత సంవత్సరంలో సంపాదించుకున్న మధురస్మృతులను నెమరేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ (Google) కూడా 2023 సంవత్సరంలో ఎవరెవరు ఏమేమీ వెతికారు? ఏ అంశాల గురించి సెర్చ్‌ చేశారనే విషయాలను వరుసగా వెల్లడిస్తున్నది. తాజాగా 2023 సంవత్సరంలో భారతీయులు అత్యధిక వెతికిన టాప్‌-10 చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది షారుక్‌ఖాన్‌కు (Sharukh Khan) బాగా కలిసొచ్చింది. వరుసగా పఠాన్‌, జవాన్‌ సినిమాలో భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించాడు. బాలీవుడ్‌కు ఎప్పటికీ తానే బాద్‌షా అని నిరూపించుకున్నాడు. తాజాగా గూగుల్‌ విడుదల చేసిన టాప్‌-10 చిత్రాల జాబితా కూడా అదే వెల్లడించింది. అందుకే ఈ ఏడాది షారుక్‌ నటించిన రెండు సినిమాలు కూడా టాప్‌-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటితోపాటు సైలెంట్‌గా విడుదలై సంచలనం సృష్టించిన గదర్‌-2, ది కేరళ ఫైల్స్‌ కూడా ఈ జాబితాలో నిలిచాయి.

Guntur Kaaram Update: గుంటూరు కారం నుంచి లేటెస్ట్ అప్‌డేట్, అమ్ము.. ర‌మ‌ణ గాడు గుర్తు పెట్టుకో గుంటూరు వస్తే పనికొస్తది.. ఓ మై బేబీ అంటూ సాగే ప్రోమో సాంగ్ విడుదల 

పాన్‌ ఇండియా సూపర్‌స్టార్‌ ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌, సల్మాన్‌ఖాన్‌ నటించిన టైగర్‌-3, కూడా టాప్‌-10లో నిలిచాయి. ఇక చాలా రోజుల తర్వాత రజినీకాంత్‌కు బంపర్‌ హిట్‌ ఇచ్చిన జైలర్‌, దళపతి విజయ్‌ నటించిన లియో, వారిసు సినిమాలు కూడా టాప్‌-10లో చోటు దక్కించుకున్నాయి. హాలీవుడ్‌ చిత్రం ఓపెన్‌హైమర్‌ కూడా ఈ లిస్ట్‌లో ప్లేస్‌ దక్కించుకోవడం విశేషం.

గూగుల్‌ ప్రకటించిన టాప్‌-10 మూవీస్‌

1. జవాన్‌

2. గదర్‌-2

3. ఓపెన్‌హైమర్‌

4. ఆదిపురుష్‌

5. పఠాన్‌

6. ది కేరళ స్టోరీ

7. జైలర్‌

8. లియో

9. టైగర్‌-3

10. వారిసు

టాప్‌-10 ఓటీటీ వెబ్‌ సిరీస్‌లు/ ట్రెండింగ్‌ షోస్‌

1. ఫర్జీ

2. వెడ్‌నెస్‌ డే

3. అసుర్‌

4. రానా నాయుడు

5. ది లాస్ట్‌ ఆఫ్‌ అస్‌

6. స్కామ్‌ 2003

7. బిగ్‌బాస్‌ 17

8. గన్స్‌ అండ్‌ గులాబ్స్‌

9. సెక్స్‌/లైఫ్‌

10. తాజా ఖబర్‌