Hero Ram Charan visited Tirumala with his family Watch Video

తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్‌చరణ్ , ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబంతో పాటు తిరుమల చేరుకున్నారు. కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీనివాసుని సన్నిధి నుంచి వారు వస్తుండగా అక్కడ ఉన్న కొందరు మీడియా వారు క్లీంకార ఫోటోను తీయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. గతేడాది జూన్‌ 20న జన్మించిన క్లీంకార ఫేస్‌ను ఇప్పటి వరకు ఎక్కడా కూడా రివీల్‌ కాకుండా వారు జాగ్రత్తపడ్డారు. కానీ నేడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీశారు.

Here's Video and Pics

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హీరో రామ్ చరణ్. pic.twitter.com/wHZ4q1Ht5p