Singer Coco Lee Died (PIC@ Instagram)

Hong Kong, July 06: హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ సింగర్‌ గాయని కోకో లీ (Singer Coco Lee) (48) కన్నుమూశారు. డిప్రెషన్‌తో బాధపడుతుందని, ఈ నెల 4న ఆమె ఆత్మహత్యకు యత్నించారని ఆమె కుటుంబీకులు తెలిపారు. ఆ తర్వాత ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆమె సిస్టర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ‘హిడెన్‌ డ్రాగన్‌’లోని ‘ఎ లవ్‌ బిఫోర్‌ టైమ్‌’ సాంగ్‌ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు నామిట్‌కావడంతో పాటు అవార్డుల ప్రదానోత్సవంలో ప్రదర్శన ఇచ్చిన తొలి చైనీస్‌ అమెరికన్‌గా నిలిచారు. కోకో లీ గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతుందని.. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించిందని ఆమె సిస్టర్స్‌ కరోల్‌, నాన్సీ పేర్కొన్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Nancy Si Lin Lee (@nancy_yauyetei)

ఇటీవల పరిస్థితి మరింత దిగజారిందని, ఈ క్రమంలోనే ఈ నెల 2న ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించిందని చెప్పారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించామని, చనిపోయేంత వరకు కోకో లీ కోమాలోనే (Singer Coco Lee Died) ఉందని వివరించారు. కోకోలీ హాంకాంగ్‌లో జన్మించారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడ మిడిల్‌ స్కూల్‌లో చదువుకున్నారు. ఆసియాలో పాప్‌ సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 30 ఏళ్ల కెరీర్‌లో కాంటోనీస్, ఆంగ్లంలో ఆల్బమ్‌లను సైతం విడుదల చేశారు.

Salaar Teaser Out: ప్రభాస్ ఫ్యాన్స్‌ వెయిటింగ్‌కు తెర, టీజర్‌ రిలీజ్ చేసిన సలార్‌ టీమ్‌, రెండు పార్టులుగా మూవీ, ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే? 

1996లో సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం చేసుకున్న తొలి చైనీస్ గాయనిగా నిలిచారు. ఆమె తర్వాతి ఆల్బమ్ కోకో లీ ఆసియాలో అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్‌గా నిలిచింది. 1997లో ఆమె మాండరిన్ ఆల్బమ్ సిన్సియర్‌తో పాటు కాంటోనీస్ ఆల్బమ్‌ను విడుదల చేసింది. 1998లో మాండరిన్ ఆల్బమ్ డి డా డి విడుదలవగా.. మూడు నెలల్లో మిలియన్‌ కాపీలు అమ్ముడయ్యాయి. ఆమె డిస్నీ మూలాన్ మాండరిన్ వెర్షన్‌లో హీరోయిన్ ఫా ములాన్‌కు గాత్రదానం చేసింది. రిఫ్లెక్షన్ అనే థీమ్ సాంగ్.. మాండరిన్ వెర్షన్‌ను పాడారు.