Hyderabad, May 06: ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో భారీ విజయం సాధించాడు. త్వరలో కొరటాల శివతో (Koratala Shiva) సినిమా మొదలు పెట్టనున్నాడు. ఎన్టీఆర్ (Jr. NTR) లైనప్ లో ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా ఉంది. ‘కేజిఫ్ 2’(KGF-2)తో భారీ సక్సెస్ సాధించిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రస్తుతం ప్రభాస్ తో (Prabhas) సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక ఎన్టీఆర్ తో సినిమా రానుంది. గతంలోనే వీరిద్దరూ పలుమార్లు కలుసుకున్నారు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో అందరితో స్నేహంగా ఉంటూ అందరితో కలిసిపోతాడు. మొన్న ఆర్ఆర్ఆర్ (RRR) సమయంలో రామ్ చరణ్, రాజమౌళితో ఉన్న అనుబంధాన్ని తెలియచేశాడు. గతంలో ప్రభాస్, మహేష్ తో కూడా ఫోటోలు షేర్ చేసి వారితో తనకున్న అనుబంధాన్ని తెలియచెప్పాడు. ఇలా ఇండస్ట్రీలో ఉన్న వారందరితో చాలా క్లోజ్ గా ఉంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. తాజాగా ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
View this post on Instagram
మే 5న ఎన్టీఆర్ (Jr. NTR), ప్రణతిల (Pranathi) పెళ్లి రోజు. అయితే అదే రోజున డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పెళ్లి రోజు కూడా కావడం విశేషం. దీంతో ఈ సంగతి తెలిసిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ని, తన వైఫ్ ని ఇంటికి ఆహ్వానించాడు. ఎన్టీఆర్ ఇంట్లో గురువారం సాయంత్రం ఈ రెండు జంటలు తమ మ్యారేజ్ యానివర్సరీని కలిసి సెలబ్రేట్ చేసుకున్నాయి.
వీరి సెలబ్రేషన్స్ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఎన్టీఆర్. ఈ ఫోటో షేర్ చేసి మనం యానివర్సరీలు కలిసి చేసుకున్నప్పుడు అది గొప్ప వేడుకలా అనిపిస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో పాటు న్యూ బిగినింగ్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ ని జతచేశారు. దీంతో ఈ న్యూ బిగినింగ్ ఏంటబ్బా అని అభిమానులు, నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు.