Jr NTR

Hyderabad, NOV 20: ఇటీవలే దేవర సినిమాతో (Devara) బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు గ్లోబల్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)‌. ప్రస్తుతం దేవర పార్టు 2తోపాటు కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్‌లో NTRNEEL మూవీని కూడా లైన్‌లో పెట్టాడని తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో లాంచ్‌ అయింది. దీంతోపాటు హిందీ ప్రాజెక్ట్‌ వార్‌ 2 షూటింగ్‌తో కూడా బిజీగా ఉన్నాడు. కాగా ఇప్పుడు తారక్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడట. టాలీవుడ్‌లో వన్ ఆఫ్‌ ది లీడింగ్‌ బ్యానర్‌గా కొనసాగుతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని ఇన్‌సైడ్‌ టాక్‌. ప్రస్తుతం తారక్‌ ప్రశాంత్‌ నీల్‌ సినిమాతోపాటు వార్‌ 2 ను పూర్తి చేయాల్సి ఉంది.

Pushpa 2 Trailer: పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్..పుష్ప 2 ట్రైలర్‌తో దుమ్మురేపిన అల్లు అర్జున్‌....ట్రైలర్ ను మీరు చూసేయండి 

ఈ ప్రాజెక్టుల షూటింగ్‌ పూర్తవగానే నెల్సన్‌ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) సినిమాపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఫిలింనగర్ సర్కిల్ టాక్‌. ఒకవేళ ఇదే నిజమైతే తారక్‌తో చేయబోయే సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్‌కు భారీ పాన్ ఇండియా సినిమాగా అరుదైన మైల్‌స్టోన్‌ అవడం ఖాయమైనట్టే.