
తమిళ, మలయాళ సినిమాల్లో విలన్ రోల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న కజాన్ ఖాన్.. జూన్ 12న అంటే సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత, ప్రొడక్షన్ కంట్రోలర్ ఎన్ఎమ్ బాదుషా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 1992లో సెంతమిళ్ పట్టు (తెలుగులో 'అమ్మకొడుకు') అనే మూవీతో కజాన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఓవరాల్ మూవీ కెరీర్ లో గంధర్వం, సీఐడీ ద మూస, ద కింగ్, వర‍్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధిరాజా లాంటి మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. 2015లో వచ్చిన 'లైలా ఓ లైలా' చిత్రంలో చివరగా కనిపించారు. ఇప్పుడు ఆయన గుండెపోటుతో చనిపోవడం ఇండస్ట‍్రీలో విషాదాన్ని నింపింది.