Hyderabad, March 19: ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలోని ‘నాటునాటు’ పాటకు (Naatu Naatu Song) ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు (Oscar Award) రావడం తెలిసిందే. అయితే, ఆ పాటను కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి (MM Keeravani) తండ్రి శివశక్తి దత్తా (Siva Shakthi Datta) మాత్రం ఇదికూడా ఓ పాటేనా? అని విమర్శలు గుప్పించారు. ‘నాటునాటు’ పాటకు అవార్డు రావడంపై మీ స్పందనేంటన్న ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ.. ‘అదొక పాటా?’ అని తీసి పారేశారు.
‘‘అదొక పాటా? అందులో మ్యూజిక్ ఎక్కడుంది నా ముఖం! ఇది ఒక విధి విలాసం. విధి విచిత్ర వైచిత్యం’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, తన కుమారుడు కీరవాణి చేసిన కృషికి ఈ పురస్కారం రూపంలో ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.