KK No More: తెలుగులో సింగర్ కెకె పాడిన టాప్ టెన్ సాంగ్స్ ఇవే, ఖుషీ నుంచి జల్సా దాకా విషాదంతో పాటు హుషారెత్తించే గీతాలెన్నో పాడిన లెజెండ్ సింగర్
Singer KK (Pic Credit: FB )

సింగర్​ కేకే.. ఈ పేరు వినడమే తప్ప ఈయన్ని ప్రముఖంగా తెర మీద చూసిన వాళ్లు చాలా తక్కువ. తొంభైవ దశకం మధ్య నుంచి​ 2000 దశకం మధ్య వరకు.. కేవలం సింగర్​ కేకే అనే పేరును లేబుల్స్‌పై చూడడం తప్పించి ఎలా ఉంటారో తెలియదంటే అతిశయోక్తి కాదు. ఆ దిగ్గజం మంగళవారం రాత్రి కోల్​కతా ప్రదర్శన తర్వాత​ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త సినీ ప్రపంచంతో పాటు ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బాలీవుడ్​తో పాటు తమిళ్​, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాళీ, అస్సామీ, గుజరాతీ, మలయాళంలోనూ 800 దాకా పాటలు పాడారు.

కోల్‌కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న అనంతరం కేకే తాను బస చేస్తున్న హోటల్‌ గదిలో కుప్పకూలి మరణించినట్లు సమాచారం. కేకే తన ఆఖరి ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్‌ గీతాలను ఆలపించారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీ సహా బాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తెలుగులో పాడిన సూపర్ హిట్స్ సాంగ్ ఓ సారి చూద్దాం.

చిత్రం: ప్రేమకావాలి (మనసంతా ముక్కలు చేసి)

చిత్రం: సంతోషం (దేవుడే దిగివచ్చినా )

చిత్రం: నువ్వే నువ్వే (ఐ యామ్ వెరీ సారీ)

చిత్రం :  ​(ఆర్య) ఫీల్​ మై లవ్

చిత్రం : ఇంద్ర ( దాయి దాయి దామ్మా)

1996లో వచ్చిన కాదల్​ దేశం(ప్రేమ దేశం) సినిమాలో హలో డాక్టర్​, కల్లూరి సాలే(కాలేజీ స్టయిలే..) పాటలతో ఆయన గొంతుక యువతరాన్ని ఊపేసింది. మిన్‌సారా కనవు(మెరుపు కలలు)లో ‍స్ట్రాబెర్రీ పెన్నే సాంగ్‌ ఆయన పేరు మారుమోగిపోయేలా చేసింది. అలాగే బాలీవుడ్‌లో  ‘హమ్‌​ దిల్​ దే చుకే సనమ్’​(1999) ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. బాలీవుడ్‌తో పాటు మొత్తం 11 భాషల్లో ఆయన పాటలు పాడారు.

తెలుగులో శంకర్‌ మహదేవన్‌ తర్వాత..  హుషారెత్తించే గీతాలె‍న్నో ఆయన పాడారు. యే మేరా జహా (ఖుషీ), సున్‌సున్‌ సోనారే-పాటకి ప్రాణం(వాసు), దేవుడే దిగి వచ్చినా(సంతోషం), దాయి దాయి దామ్మా(ఇంద్ర), ఐ యామ్​ వెరీ సారీ (నువ్వే నువ్వే), నాలో నువ్వొక సగమై(జానీ), సీఎం పీఎం అవ్వాలన్నా(దిల్​), ఫీల్​ మై లవ్​(ఆర్య), చైల చైలా(శంకర్​ దాదా ఎంబీబీఎస్​), లే లే లేలే(గుడుంబా శంకర్​), ఇంతే ఇంతింతే..(బాలు ఏబీసీడీఎఫ్​జీ), అవును నిజం(అతడు), హే జానా..(జై చిరంజీవా), ఎగిరే మబ్బులలోనా(హ్యాపీ), ఒక చిన్ని నవ్వే నవ్వి(అశోక్​), నా పేరు చిన్నా(రణం), మై హార్ట్ ఈజ్​ బీటింగ్​(జల్సా).. లాంటి హుషారెత్తించే గీతాలెన్నో గుర్తుకు వస్తాయి.