పీఎస్ వినోద్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కూజంగల్’ తమిళ్ చిత్రం ఇండియా నుంచి ఆస్కార్స్‌కు (Oscars 2022) ఎంపికైంది. మన దేశం తరుఫున ఆస్కార్స్ బరిలో పోటీ పడేందుకు తమిళ చిత్రం ‘కూజంగల్’ను అధికారికంగా ఎంపిక చేశారు. ఎంతో సహజంగా తీసిన ఈ అవార్డ్ విన్నింగ్ మూవీ మరో 13 ఉత్తమ చిత్రాల్ని వెనుకకునెట్టి ఆస్కార్స్ రేసుకు (Koozhangal Is India’s Official Entry to Oscars 2022) చేరుకోగలిగింది. మార్చ్ 27, 2022న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న వేడుక కోసం అప్పుడే సినిమాల సెలక్షన్ ప్రాసెస్ మొదలైంది.
‘సర్దార్ ఉదమ్, షేర్నీ, మండేలా, తూఫాన్, కాగజ్’ లాంటి చిత్రాలు ‘కూజంగల్’కి గట్టి పోటీ ఇచ్చాయి. అయితే, దేశంలోని అన్ని భాషల చిత్రాల్లోంచి చివరకు ఈ సినిమాకే సెలక్షన్ టీమ్ పట్టం కట్టింది. ఇప్పటికే ‘కూజంగల్’ ‘50వ రాటర్‌డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రతిష్ఠాత్మక ‘టైగర్ అవార్డ్’ స్వంతం చేసుకుంది. ఇక మరో విశేషం ఏంటంటే... ఈ హైలీ అక్లేమ్డ్ సెన్సిటివ్ మూవీని నయనతార, ఆమె బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ సంయుక్తంగా నిర్మించటం. వారి ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్‌పై దర్శకుడు వినోద్‌రాజ్ సారథ్యంలో ‘కూజంగల్’ రూపొందింది!