Leo Poster (Photo Credits: Instagram)

Chennai, OCT 18: తమిళహీరో విజయ్ నటించిన లియో (Leo) చిత్ర యూనిట్‌ కు షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు (madras High Court). రేపు విడుదల కాబోతున్న లియో సినిమాను ఉదయం 4 గంటలకే (4 AM Show) ప్రదర్శించేలా అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది యూనిట్, కానీ తెల్లవారుజామున 4 గంటల స్పెషల్‌ షోకు అనుమతిలేదని మద్రాసు హైకోర్టు తెలిపింది. లోకేశ్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్‌ నటించిన లియో సినిమా (Leo Movie) ప్రపంచవ్యాప్తంగా గురువారం నాడు విడుదలవనుంది. రోజుకి ఐదు షోలకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లవారుజామున 4 గంటల ప్రత్యేక ప్రదర్శనకు, ఉదయం 9 గంటలకుకాకుండా 7 గంటలకు అనుమతి ఇవ్వాలని సెవన్‌ స్క్రీన్‌ నిర్మాణ సంస్థ తరఫున మద్రాసు హైకోర్టులో సోమవారం అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణను జస్టిస్‌ అనితా సుమంత్‌ మంగళవారానికి వాయిదా వేశారు.

69th National Film Awards: 69వ భారత జాతీయ చలనచిత్ర అవార్డుల్లో దుమ్మురేపిన తెలుగు సినీ పరిశ్రమ, ఈ ఏడాది పూర్తి విన్నర్స్ లిస్ట్ ఇదిగో 

మంగళవారం మొదటి కేసుగా విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది.. 4, 7 గంటల షోలతో సమస్యలు వస్తాయని, ఇప్పటి వరకు అలాంటి అనుమతివ్వలేదని వాదించారు. 9 గంటల షోలను ప్రారంభించడమే ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన అని దానిని ఉల్లంఘించడం కుదరదన్నారు. గతంలో 4 గంటల ప్రదర్శనకు వెళ్లిన అభిమాని మృతిచెందాడని తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు ఉన్నాయన్నారు. లియో ట్రైలర్‌ విడుదల సమయంలోనూ ఓ థియేటర్‌లో కుర్చీలు ధ్వంసమయ్యాయని చెప్పారు.

Mahadev Betting App Case: బాలీవుడ్‌లో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రకంపనలు, నటి శ్రద్ధా కపూర్‌తో సహా పలువురు ప్రముఖులకు ఈడీ నోటీసులు 

సెవన్‌ స్క్రీన్‌ నిర్మాణ సంస్థ తరఫున హాజరైన లాయరు.. చట్టంలో అవకాశం మేరకు తమకు మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. శని, ఆదివారాల్లో మాత్రమే మినహాయింపు ఇవ్వడం కుదురుతుందని, అన్ని చిత్రాలకు 5 షోలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వ లాయరు జవాబిచ్చారు. అభిమానుల కోసం 4 గంటల షో వేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ లాయరు చెప్పారు. జోక్యం చేసుకున్న న్యాయమూర్తి అన్ని షోలు అభిమానుల కోసమే ప్రదర్శిస్తున్నారని అన్నారు. విడుదలయ్యే రోజు తెల్లవారుజామున 4 గంటల షోకు అనుమతి ఇవ్వడం కుదరదని తెలిపారు. 7 గంటల ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేయాలన్నారు. ఈ విషయమై బుధవారం మధ్యాహ్నంలోపు ప్రభుత్వం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.