Hyderabad, May 08: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu), కీర్తి సురేష్ (Keerthi Suresh) జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’(Sarkaru vaari pata) సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా శనివారం హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్(Pre Release) ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

ఈ ఈవెంట్ లో మహేష్ బాబు (Mahesh Babu) మాట్లాడుతూ… చాలా ఆనందంగా ఉంది మిమ్మల్నందర్నీ ఇలా చూడటం. రెండేళ్లు పైనే అయింది మనం కలిసి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా ఫేవరేట్ క్యారెక్టర్స్ లో ఇది ఒకటి. నన్ను పూర్తిగా మార్చేశారు ఈ సినిమాలో. కొన్ని సీన్లు చేసేటప్పుడు పోకిరి (Pokiri) రోజులు గుర్తొచ్చాయి. షూటింగ్స్ లో చాలా ఎంజాయ్ చేశాను. పరశురామ్ కథ చెప్పి ఇంటికెళ్లిపోయాక నాకు.. ఒక్కడు సినిమా చూసి డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను. మీరు ఇప్పుడు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఎలా తీస్తానో మీరే చూడండి, ఇరగదీసేస్తాను అని మెసేజ్ పెట్టారు. ఈ సినిమా చూశాక నా అభిమానులకి, నాన్న గారి అభిమానులకి ఆయన ఫేవరేట్ డైరెక్టర్ అవుతారు. సర్కారు వారి పాట నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యు సర్. అంటూ ఎమోషనల్ అయి డైరెక్టర్ ని హగ్ చేసుకున్నారు.

Jr NTR,Prashanth Neel:కేజీఎఫ్‌ డైరక్టర్‌తో సెలబ్రేషన్స్‌లో ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఒకే దగ్గర పెళ్లి రోజు జరుపుకున్న రెండు ఫ్యామిలీస్, ఎందుకు కలిశారో తెలుసా? 

ఈ సినిమాలో చాలా హైలేట్స్ ఉంటాయి. సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తారు. కీర్తి చాలా కొత్తగా చేసింది ఈ సినిమాలో. ఎప్పుడు డేట్స్ అడిగినా కాదనకుండా షూటింగ్స్ కి వచ్చింది. తమన్ (Thaman)మ్యూజిక్ అందరికి కనెక్ట్ అవుతుంది. తమన్ BGM కి నేను పెద్ద ఫ్యాన్. ఈ సినిమాలో అదరగొట్టేసాడు. ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్స్. శేఖర్ మాస్టర్ కి స్పెషల్ థ్యాంక్స్. ఈ నిర్మాతలతో రెండు బ్లాక్ బ్లాస్టర్స్ తీశాను. ఇది మరో బ్లాక్ బ్లాస్టర్ అవుతుంది. కరోనా (Corona) వల్ల ఈ రెండేళ్లలో నాకు చాలా దూరమయ్యాయి. నాకు దగ్గరైన వాళ్ళు దూరమయ్యారు. ఏది జరిగినా నా మీద మీకున్న అభిమానం మాత్రం మారలేదు. మీ అభిమానం చాలు ధైర్యంగా ముందుకెళ్లడానికి. మీ అందరికి నచ్చే సినిమా రాబోతుంది అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్.