స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఒకరోజు ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సైరా నర్సింహారెడ్డి' మేకింగ్ వీడియో బుధవారం విడుదల చేశారు. భారతదేశంలో బ్రిటీష్ పాలనను వ్యతిరేకిస్తూ 1857లో మొదలైన తొలి దశ తిరుగుబాటు ఉద్యమానికి 30 సంవత్సరాల ముందే స్వరాజ్యాన్ని కాంక్షిస్తూ, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రప్రథమంగా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేశాడు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా 'సైరా నర్సింహారెడ్డి' చిత్రం తెరకెక్కుతుంది.
కొణిదెల ప్రొడ్రక్షన్ కంపెనీ నిర్మాణంలో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
కొణిదెల ప్రొడ్రక్షన్ కంపెనీ నిర్మాణంలో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ ప్రాంతం కేంద్రంగా నర్సింహా రెడ్డి సాగించిన పోరాటాలు, ఆయన జీవితంలోని అద్భుత ఘట్టాలను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు.
ఈ సినిమాలో ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు, కన్నడ నుంచి కిచ్చా సుదీప్, తమిళం నుంచి విజయ్ సేతుపతి మొదలుకొని మరెందరో బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ మరియు శాండల్ వుడ్ సినీ పరిశ్రమలకు చెందిన స్టార్లు కనువిందు చేయనున్నారు. నయనతార, తమన్నా, జగపతి బాబు, రవికిషన్, నిహారిక, నాజర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
Ram Charan Tweet:
హైటెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఈ చిత్రం రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుని, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అక్టోబర్ 2న, గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.