
Chennai, DEC 09: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trishaకు తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ (Mansoor Ali Khan) క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే (Apologises To Trisha). త్రిషపై ఇటీవలే ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేగాయి. ఆయన వ్యాఖ్యలపై సినీలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమిళ, టాలీవుడ్ చిత్ర ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఆయన మాత్రం క్షమాపణలు చెప్పేదే లేదని తేల్చి చెప్పారు. అయితే, పరిస్థితి తీవ్రత నేపథ్యంలో తాజాగా త్రిషపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన వెనక్కి తగ్గారు. ఈ మేరకు త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది.
ఈ వివాదం మగిసింది.. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో మరోసారి ఈ గొడవ కొత్త రూపం సంతరించుకుంది. త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పిన మరుసటి రోజు మన్సూర్ ఆలీ ఖాన్ మీడియా ముందు మాట్లాడుతూ.. త్రిషకు, ఖుష్బూ, చిరంజీవిలకు పరువునష్టం కింద నోటీసులు పంపిస్తున్నానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.
Junior Mehmood No more: మరాఠీ నటుడు జూనియర్ మహమూద్ మృతి.. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ తో కన్నుమూత
చెప్పినట్లుగానే.. త్రిషకు, ఖుష్బూ, చిరంజీవిలపై శుక్రవారం మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన లాయర్ ధనంజయన్ ద్వారా కోటి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో కోరారు. ఇక ఈ పిటిషన్‌లో వీడియో మొత్తం చూడకుండా తన పరువుకు భంగం కలిగించారని మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నాడు. ఈ కేసు డిసెంబర్ 11న మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది.