Kannada Actor Leelavathi Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ నటి లీలావతి(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెఇటీవలే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు.లీలావతి కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 600 చిత్రాలలో నటించింది. సినీ ఇండస్ట్రీలో ఆమె కెరీర్ ఆరు దశాబ్దాలుగా సాగింది. ఆమెకు 1999-2000లో జీవితకాల సాఫల్యానికి ప్రతిష్టాత్మకమైన డా. రాజ్‌కుమార్ అవార్డు, 2008లో తుమకూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సహా అనేక ప్రశంసలను అందుకుంది.
బెల్తంగడిలో జన్మించిన లీలావతి చిన్నతనంలోనే నాటకరంగంపై మక్కువ పెంచుకున్నారు. 1949లో సినీ రంగ ప్రవేశం చేసిన లీలావతి ఆ తర్వాత కన్నడ సినిమాలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు అయిన వినోద్ రాజ్‌తో కలిసి జీవించారు. 1949లో శంకర్ సింగ్ దర్శకత్వం వహించిన నాగకన్నికే సినిమాతో అరంగేట్రం చేశారు.
Here's PTI Video
VIDEO | Eminent Kannada actor Leelavathi (85) passed away in a private hospital in Bengaluru after prolonged illness earlier today.
(Source: Third Party) pic.twitter.com/DDXAbT5sEB
— Press Trust of India (@PTI_News) December 8, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)