Vizag, JAN 20: విశాఖ వేదికగా లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో () జరిగిన ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఎఎన్ఆర్ శతజయంతి వేడుకల కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పాల్గొన్నారు. ఈ సందర్భంలో తన ఆటో బయోగ్రఫీ రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్పగిస్తున్నట్లు చిరంజీవి (Chiranjeevi) ప్రకటించారు. విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్య తిథి, ఎఎన్ఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ కళామతల్లి ముద్దు బిడ్డలని.. వారితో కలిసి పనిచేసేటపుడు ఎన్నో విలువైన సహాలు ఇచ్చేవారని అన్నారు. బలహీనతల్ని బలాలుగా ఎలా మార్చుకోవాలో అక్కినేని నాగేశ్వరరావు గారి చూసి నేర్చుకున్నానని చిరంజీవి అన్నారు. తను స్టార్ అవ్వడానికి యండమూర వీరేంద్రనాథ్ కూడా ఒక కారణమంటూ చెప్పిన చిరంజీవి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలను గుర్తు చేసుకున్నారు.
Annayya #Chiranjeevi garu at Sr NTR 28th Vardhanthi and ANR Centenary Celebrations By Loknayak Foundation Today at Vizag
Boss @KChiruTweets #MegastarChiranjeevi #Vishwambara pic.twitter.com/07Ne6vMEjb
— Chiranjeevi Army (@chiranjeeviarmy) January 20, 2024
యండమూరి వంటి గొప్ప స్టార్ రైటర్ తన బయోగ్రఫీ రాస్తానని అనడం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పిన చిరంజీవి ఈ బాధ్యతను ఆయనకే అప్పగిస్తున్నానంటూ వేదికపై ప్రకటించారు. త్వరలోనే అది జరిగి తీరుతుందని వెల్లడించారు. చిరంజీవి ప్రస్తుతం 156 వ సినిమాగా ‘విశ్వంభర’ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఆగస్టులో ‘భోళా శంకర్’ తో వచ్చినా అది అనుకున్నట్లుగా సక్సెస్ కాలేదు. విశ్వంభర సినిమాను వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైంది. 2025 సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.