Mukesh Khanna Death Hoax (Photo Credits: Instagram)

బతికున్న నటుడిని కరోనాతో చనిపోయాడంటూ  నెటిజన్లు వార్తను సోషల్ మీడియాలో వైరల్ (Mukesh Khanna Death Hoax) చేశారు. శక్తిమాన్ ముఖేష్‌ ఖన్నా ఇక లేరంటూ సోషల్ మీడియాలో వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. కాగా కోవిడ్‌ కారణంగా తాను చనిపోయానంటూ వస్తున్న వార్తలపై (Mukesh Khanna Debunks Viral Death Hoax News) బాలీవుడ్‌ నటుడు ముఖేష్‌ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు కరోనావైరస్ సోకలేదని, ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించాడు. ఈమేరకు సోషల్‌ మీడియాలో వీడియో రిలీజ్‌ చేసి క్లారిటీ ఇచ్చాడు..

"మీ ఆశీర్వాదాల వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంతో (‘I Am Perfectly Alright) ఉన్నాను. నేను కోవిడ్‌ బారిన పడి ఆస్పత్రిలో చేరానని వస్తున్న వార్తలు అవాస్తవం. నాకసలు కరోనా రాలేదు. ఈ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో, ఏ ఉద్దేశ్యంతో వాటిని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. వారిని ఏం చేస్తే ఇలాంటివి మానేస్తారు? సోషల్‌ మీడియా వల్ల కూడా ఈ సమస్య వస్తోంది. కానీ ఇలా ఫేక్‌ న్యూస్‌లతో ప్రజల ఎమోషన్లతో ఆడుకోవడం దారుణం, దీనికి బాధ్యులైన వారిని శిక్షించి తీరాలి. ఈ వార్తలతో నేను విసిగి వేసారిపోయాను" అని వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు

Here's Mukesh Khanna Video

 

View this post on Instagram

 

A post shared by Mukesh Khanna (@iammukeshkhanna)

కాగా ఈ మధ్యే సింగర్‌ లక్కీ అలి కూడా చనిపోయాడంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో తానింకా బతికే ఉన్నానంటూ అతడే స్వయంగా ఓ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ముఖేష్‌ ఖన్నా విషయానికి వస్తే.. అతడు సినిమాలతో పాటు టీవీ షోలలోనూ కనిపించాడు. శక్తిమాన్‌ సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకున్నాడు. సౌధాగర్‌, యల్గార్‌, మేన్‌ కిలాడీ తు అనారీ వంటి పలు చిత్రాల్లోనూ నటనతో ఆకట్టుకున్నాడు.