Rahul Sipligunj | File Photo

Hyderabad, March 01: తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj).. బార్బర్ షాప్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి నేడు ప్రపంచంలో అత్యున్నత వేదిక ఆస్కార్ వరకు చేరుకున్నాడు. 1989 ఆగష్టు 22న హైదరాబాద్ పాతబస్తీ మంగళ్ హాట్ లో ఒక బార్బర్ కుటుంబంలో రాహుల్ సిప్లిగంజ్ జన్మించాడు. రాహుల్ కూడా తన తండ్రితో కలిసి ఆ బార్బర్ షాప్ (Barber Shop) లో పని చేసేవాడట. ఇక చిన్నప్పటి నుంచే సంగీతం పై ఆసక్తి ఉండడంతో స్కూల్ నుంచి తిరిగి రాగానే గిన్నెలు పై కర్రలతో వాయిస్తూ ఫోక్ సాంగ్స్ పడేవాడట. ఈ క్రమంలోనే 7వ తరగతి చదువుతున్న సమయంలో అలా పడుతున్న రాహుల్ ని చూసిన వాళ్ళ నాన్న.. రాహుల్ లో మంచి టాలెంట్ ఉందని గుర్తించి, ఆయనకి తెలిసిన గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీత సాధన కోసం జాయిన్ చేశాడు. దీంతో విఠల్ రావు (Vital rao) దగ్గర గజల్ పాటలు పై పట్టు సాధించాడు. విఠల్ రావు దగ్గరే దాదాపు 7 సంవత్సరాలు పని చేశాడు. ఆ సమయంలోనే డబ్బింగ్ సినిమాలకు కోరస్ పడే అవకాశాలు అందుకున్నాడు. అలా కోరస్ పడుతున్న సమయంలో తన వాయిస్ బాగుంది అని కొందరు వ్యక్తులు.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ లకు పరిచయం చేసేవారు. ఆ నేపథ్యంలోనే నాగచైతన్య డెబ్యూట్ మూవీ జోష్ లో ఫుల్ సాంగ్ పడే అవకాశం అందుకున్నాడు. ఆ సినిమాలో పాడిన ‘కాలేజీ బుల్లోడా’ సాంగ్ తనకి ఒక సంతకం లాంటిది అంటూ రాహుల్ చెబుతుంటాడు. ఇక ఆ పాటకి మంచి ప్రోత్సాహం రావడంతో.. అప్పటి వరకు తను పాడిన పాటలన్ని ఒక సీడీ చేసుకొని, దాని తీసుకోని వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి (MM kiravani) వినిపించాడు.

RRR: అంతర్జాతీయ వేదికలపై 'ఆర్ఆర్ఆర్' సత్తా.. హాలీవుడ్ క్రిటెక్స్ అవార్డుల్లో ఏకంగా ఐదు పురస్కారాలు సొంతం 

కీరవాణికి రాహుల్ వాయిస్ నచ్చడంతో, తన కోరస్ టీంలో అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత ఎన్టీఆర్ దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’ సాంగ్ పడే అవకాశం ఇచ్చాడు కీరవాణి. ఆ పాటతో రాహుల్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక అక్కడి నుంచి రాహుల్ అసలు కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఆ తరువాత మణిశర్మ సంగీత దర్శకత్వంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా పాడాడు. కేవలం ఒక ప్లే బ్యాక్ సింగర్ గానే ఉండడం ఇష్టం లేక, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోడానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి.. రాప్ సాంగ్స్ చేయడం మొదలు పెట్టాడు.

Naatu Naatu LIVE at Oscars: ఆస్కార్ స్టేజి మీద నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్, RRR మూవీకి మరో అరుదైన గౌరవం 

ఈ క్రమంలోనే మగజాతి, ఎమ్ మాయలో, మంగమ్మ, మాకికిరికిరి, పూర్ బాయ్, దావత్, గల్లీ కా గణేష్, దూరమే, జై బజరంగ్, హిజ్రా వంటి రాప్ సాంగ్స్ చేసి హిట్ కొట్టి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక రాహుల్ కెరీర్ మరో మెట్టుకి వెళ్లడం స్టార్ట్ చేసింది రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో.. దేవిశ్రీ ప్రసాద్ (Devisri prasad) సంగీత దర్శకత్వంలో ఈ సినిమాలోని ‘రంగ రంగ రంగస్థలాన’ అనే సాంగ్ పాడి స్టార్ సింగర్ గా ఎదిగాడు. ఆ తరువాత వచ్చిన RRR లో నాటు నాటు సాంగ్ తో శిఖర స్థాయిని అందుకున్నాడు అనే చెప్పాలి.

కాల భైరవతో కలిసి రాహుల్ పాడిన ఈ పాట ప్రపంచం మొత్తాన్ని ఎలా ఉర్రూతలుగిస్తుందో అందరికి తెలుసు. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకుంది. ఇక ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ నామినేషన్స్ లో కూడా ఈ పాట చోటు దక్కించుకొని హిస్టరీ క్రియేట్ చేసింది. మర్చి 12న ఆస్కార్ అవార్డుల పురస్కారం జరగనుంది. కాగా ఆస్కార్ స్టేజి పై రాహుల్ అండ్ కాల భైరవ నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ అవకాశం కోసం ప్రపంచంలోని ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తుంటారు. అటువంటి అవకాశం ఇప్పుడు వీరిద్దరికి దొరికింది.

Ram Charan @ GMA3: పుట్టబోయే పిలల్లను ఎలా పెంచుతానంటే? అమెరికన్ షోలో ఆసక్తికర అంశాలను పంచుకున్న రామ్ చరణ్, న్యూయార్క్ లో చెర్రీ క్రేజ్ మామూలుగా లేదుగా.. 

ఇక రాహుల్ సిప్లిగంజ్ గురించి చెప్పుకోవాలి అంటే.. తన తండ్రితో కలిసి వాళ్ళ బార్బర్ షాప్ లో పని చేస్తూనే సంగీతం పై పట్టు సాధించి, ఆ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు కోసం పోరాడి, చివరికి ప్రపంచ అత్యున్నత వేదిక అయిన ఆస్కార్ స్టేజి వరకు చేరుకున్న రాహుల్ ప్రయాణం అద్భుతం అనే చెప్పాలి. ఇక ఈ అవకాశం అందుకోవడంతో రాహుల్ అభిమానులు, ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.