Natu Natu Song (Photo-Video Gram/RRR)

Newdelhi, March 13: బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు..’ ఉత్తమ పాటగా ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్‌ వేదికపై ఆర్ఆర్‌ఆర్‌ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అవార్డును అందుకున్నారు. తద్వారా ఆస్కార్‌ గెలిచిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్‌ఆర్‌, తొలి భారతీయ గీతంగా ‘నాటు నాటు’ చరిత్ర సృష్టించాయి. బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడిన ‘అప్లాజ్‌’ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌), ‘లిఫ్ట్‌ మి అప్‌’ (బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫెరవర్‌), దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ (టాప్‌గన్‌ మావెరిక్‌) పాటలను వెనక్కి నెట్టి ‘నాటు నాటు..’ ఆస్కార్‌ దక్కించుకుంది.  కాగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ కేటగిరీలో  ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు కూడా (The Elephant Whisperers) ఆస్కార్ పురస్కారం దక్కింది. ఈ సినిమాకు కార్తీకీ గోన్‌సాల్వెస్ దర్శకత్వం వహించగా, గునీత్ మోంగా నిర్మించారు. ‘ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్’ సినిమాకు ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు లభించింది. చార్లీ మెక్సీ, మాథ్యూ ఫ్రూడ్‌ దీనిని రూపొందించారు.

ఆస్కార్స్‌ లో భారతీయ సినీ సందడి.. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్ పురస్కారం

ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె  ‘నాటునాటు’ పాటను పరిచయం చేసి పాట నేపథ్యాన్ని వివరించారు. గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌లో ఈ పాట పాడగా అమెరికన్ డ్యాన్సర్ అద్భుతంగా  డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ఇక, ఆస్కార్ బరిలో నిలిచిన భారతీయ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ దట్ బ్రీత్స్’కు నిరాశే ఎదురైంది. ఈ సినిమా తుది జాబితాలో చోటు దక్కించుకున్నప్పటికీ ‘నవానీ’ ముందు నిలవలేకపోయింది. ‘బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్’ సినిమాకుగాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు లభించింది.

నాటు నాటు పాటకు మరో అంతర్జాతీయ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును అందుకున్న చంద్రబోస్