Chennai, March 02: స్టార్ కపుల్స్ నయనతార (Nayanthara), విగ్నేష్ శివన్ (Vignesh Shivan) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్, కోలివుడ్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు ఏడేళ్లపాటూ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో 2022 జూన్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లికంటే ముందే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు. అయితే స్టార్ జంట మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. రీసెంట్‌గా నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విగ్నేష్ శివన్‌ని అన్ ఫాలో (Nayanthara Unfollows Husband Vignesh Shivan) చేసింది. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
నయనతార ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వారి పిల్లలను చూపిస్తూ తొలిపోస్ట్ చేసింది. ఇక దానికి లక్షల లైక్‌లు, కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం నయనతారకు ఇన్‌స్టాలో 78లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, తాజాగా నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా దీనిపై నయనతార క్లారిటీ ఇవ్వవలసి ఉంది.