Neru OTT Streaming Date and Time

మలయాళం దర్శకుడు జీతూ జోసెఫ్ కి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన నుంచి వచ్చిన 'దృశ్యం' .. 'దృశ్యం 2' సినిమాలు, మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లోను ప్రేక్షకుల ఆదరణను పొందాయి. అలాంటి దిగ్గజ దర్శకుడు మళయాలం టాప్ హీరో మోహన్ లాల్ హీరోగా నిర్మించిన చిత్రం నెరు.

మోహన్‌లాల్‌ (Mohanlal) కీలక పాత్రలో వచ్చిన ఈ చిత్రం డిసెంబరు 21న మలయాళంలో విడుదలైంది. కోర్టు రూమ్‌ డ్రామాగా వచ్చిన ‘నెరు’ (Neru) బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.థియేటర్లలో మలయాళంలో మాత్రమే రిలీజైన నేరు.. డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar)లో ఓటీటీలోకి తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లోకి వచ్చేసిన బ్లాక్ బాస్టర్ మూవీ నెరు, అత్యాచారానికి గురైన అంధురాలికి న్యాయం కోసం జరిగే పోరాటమే సినిమా

ఈ చిత్రానికి జీసెఫ్‍తో పాటు శాంతి మాధవి రచయితగా వ్యవహరించారు.నేరు చిత్రంలో అనాశ్వర రాజన్, ప్రియమణి, శాంతి మహదేవి, సిద్ధిఖీ, జగదీశ్, కేబీ గణేశ్ కుమార్, శంకర్, మాథ్యూ వర్గీస్, హరిత నాయర్ కీలకపాత్రలు పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. విష్ణు శ్యాం సంగీతం అందించారు.

నెరు సినిమా రివ్యూ

ఈ కథ మొత్తం కేరళలో నడుస్తుంది .. మహ్మద్ (జగదీశ్) దంపతుల ఏకైక సంతానమే సారా (అనస్వర రాజన్). ఆర్థికపరమైన ఇబ్బందులు లేని కుటుంబమే వారిది. 'సారా'కి ఒక అరుదైన వ్యాధి కారణంగా 12వ యేట చూపుపోతుంది. ఎదుటివారి స్పర్శ కారణంగా వారి స్వభావం .. ఒకసారి తడిమి చూస్తే, మట్టితో వారి బొమ్మను చేయగల నైపుణ్యం ఆమె సొంతం. యవ్వనంలోకి అడుగుపెట్టిన సారాను ఆ దంపతులు ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటారు.

ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా 13 విభాగాల్లో పోటీలో నిలిచిన ఓపెన్‌హైమర్‌, ఆరు విభాగాల్లో పోటీలో నిలిచిన బార్బీ సినిమా, నామినేషన్స్‌ జాబితా ఇదిగో..

ఒక రోజున మహ్మద్ దంపతులు ఒక ఫంక్షన్ కి వెళతారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న 'సారా'పై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి ఒడిగడతాడు. ఈ దుర్మార్గానికి తెగబడింది ఎవరో గుర్తించలేక పోలీసులు సైతం ఓ దశలో చేతులు ఎత్తేస్తారు. స్వతహాగా శిల్పి అయిన సారా తనపై దారుణానికి పాల్పడిన వ్యక్తి రూపాన్ని శిల్పంగా తయారుచేస్తుంది. ఆ విగ్రహానికి దగ్గర పోలికలున్న మైఖేల్‌ జోసెఫ్‌ (శంకర్‌ ఇందుచూడన్‌) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేస్తారు.

Here's Trailer

అతడు ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు కావడంతో ఈ కేసు సంచలనంగా మారుతుంది. ఎంతటి క్లిష్టమైన కేసునైనా తన వాదనా పటిమతో గెలిపించగలిగే రాజశేఖర్‌ (సిద్ధిఖ్‌)ను మైఖేల్‌ తండ్రి అడ్వకేట్‌గా నియమించుకుంటాడు. దీంతో మైఖేల్‌కు బెయిల్‌ వస్తుంది. ఈ కేసును వాపసు తీసుకోమని మైఖేల్‌ కుటుంబం నుంచి సారాకు సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ వస్తుంది.

మైఖేల్ ను కాపాడటం కోసం రంగంలకి దిగిన రాజశేఖర్, తన పరపతిని ఉపయోగించి 'సారా' తరఫున ఎవరూ వాదించకుండా చేస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో 'సారా' తల్లిదండ్రులు, విజయ్ మోహన్ (మోహన్ లాల్)ను కలుస్తారు. కొన్ని కారణాల వలన .. కొంతకాలంగా ఆయన కోర్టుకు దూరంగా ఉంటూ ఉంటాడు. అందుకు కూడా రాజశేఖర్ కారణం. ముందుగా ఈ కేసు జోలికి పోకపోవడమే మంచిదనుకున్న విజయ్ మోహన్, ఆ తరువాత 'సారా' తరఫున పోరాడాలని నిర్ణయించుకుంటాడు.

'సారా'కి చూపులేదు .. స్పర్శ ద్వారా ఆమె నేరస్థుడిని గుర్తించడం వలన .. బొమ్మను చేసి చూపించడం ద్వారా కేసు గెలిచే అవకాశం లేదు. మైఖేల్ అత్యాచారం చేశాడనడానికి ఇతర ఆనవాళ్లు ఏమీ లభించవు. సీసీటీవీ కెమెరా పుటేజ్ కూడా దొరక్కుండా రాజశేఖర్ చేస్తాడు. ఆ రోజున మైఖేల్ అసలు ఆ ఊళ్లోనే లేడని కోర్టును రాజశేఖర్ నమ్మించే ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు విజయ్ మోహన్ ఏం చేస్తాడు? రాజశేఖర్ తో అతనికి గల గొడవ ఏంటి? 'సారా' కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది మిగతా కథ.

శాంతి మాయాదేవి - జీతూ జోసెఫ్ కలిసి రాసుకున్న కోర్టు రూమ్ డ్రామా ఇది. కథలో చాలా వరకూ కోర్టులోనే జరుగుతుంది. కోర్టు సీన్లు మొదటి నుంచి చివరి వరకూ అలా ప్రేక్షకుడిని కూర్చోబెట్టేస్తుంది. కథ కోర్టులోనే ఎక్కువగా నడుస్తున్నట్టు అనిపించినా, దాని వెనుక గల కారణాలు కుతూహలాన్ని రేపుతాయి. కంటిచూపు కోల్పోయిన ఒక యువతి తనపై అఘాయిత్యానికి పాల్పడినవాడిని చట్టానికి పట్టించడానికి ఆరాటపడే సన్నివేశాలు .. ఆమెకి ఎలాగైనా న్యాయం జరగడం కోసం లాయర్ గా విజయ్ మోహన్ చేసే ప్రయత్నాలు .. ఆ ప్రయత్నాలకు అడ్డుపడటానికి రాజశేఖర్ వేసే ఎత్తుగడలు ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతూ కథతో పాటు పరుగులు పెట్టిస్తాయి. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ చూసిన తరువాత ఈ కథ మరింత బలమైనదనే విషయం మనకి అర్థమవుతుంది.

మోహన్ లాల్ ... సిద్ధికీ .. ప్రియమణి నటన సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఈ ముగ్గురూ సీనియర్ ఆర్టిస్టులు కావడం వలన, వాళ్ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కానీ ఈ సినిమాలో అంధురాలిగా చేసిన 'అనస్వర రాజన్' నటనను అభినందించకుండా ఉండలేం. ఈ పాత్ర కోసం నిజంగానే అంధురాలిని తీసుకున్నారేమో అనిపించకమానదు. ఆ యువతి నటన అంత గొప్పగా కనిపిస్తుంది. ఆ తరువాత కూడా ఆ పాత్ర గుర్తుండిపోతుంది.