Credits: Twitter

Newdelhi, March 13: సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డ్స్ (Oscars 2023)లో భారతీయ సినిమా (Indian Movie) సందడి చేసింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట బస్ట్ సాంగ్ అవార్డును సాధించింది. అలాగే, బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్ విభాగంలో భారత్‌కు ఆస్కార్ లభించింది. డాక్యుమెంటరీ ఫిల్మ్ కేటగిరీలో  ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు (The Elephant Whisperers) ఆస్కార్ పురస్కారం దక్కింది. ఈ సినిమాకు కార్తీకీ గోన్‌సాల్వెస్ దర్శకత్వం వహించగా, గునీత్ మోంగా నిర్మించారు.

“నాటు నాటు”కు ఆస్కార్ పురస్కారం.. తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాపితం.. ఆస్కార్‌ గెలిచిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్‌ఆర్‌, తొలి భారతీయ గీతంగా ‘నాటు నాటు’ చరిత్ర

ఆస్కార్ విజేతల జాబితా:

  • ఉత్తమ నటుడు.. బ్రెండాన్ ఫాసర్ (ది వేల్)
  • ఉత్తమ చిత్రం.. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
  • బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ను సొంతం చేసుకున్న చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌.
  • బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ చిత్రానికి గాను అవార్డును అందుకున్న చిత్ర దర్శకురాలు కార్తికి గొన్సాల్వేస్‌, నిర్మాత గునీత్‌ మోగ్న.
  • ఉత్తమ సహాయనటిగా ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌’ సినిమాలో నటనకు అకాడమీ అవార్డు అందుకున్న జేమిలీ కర్టీస్‌.
  • బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌లో అవార్డు అందుకున్న ‘ది వేల్‌’.
  • ఉత్తమ సహాయనటుడిగా కే హ్యూ క్వాన్‌. ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ ది వన్స్‌’ సినిమాలో నటనకు గానూ ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
  • ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ చిత్రానికి గానూ ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డు అందుకున్న జేమ్స్‌ ఫ్రెండ్‌.
  • ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రానికి సంబంధించి బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే కేటగిరిలో అవార్డు దక్కించుకున్న డేనియల్‌ క్వాన్‌, డేనియల్‌ షెనెర్ట్‌.
  • ఉత్తమ యానిమేటడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా ‘పినాషియో’.
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ అవార్డును దక్కించుకున్న ‘నవానీ’ బృందం.
  • బెస్ట్‌ యానిమేటెడ్‌ షాట్‌ అవార్డు అందుకున్న ‘ది బాయ్‌ ది మోల్‌ ది ఫాక్స్‌ అండ్‌ ది హార్స్‌’ టీమ్‌.
  • బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డు అందుకున్న ‘అవతార్‌’ టీమ్‌.
  • బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌ అందుకున్న వాకర్‌ బెర్టెల్‌మాన్‌. ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’ చిత్రానికి గాను ఆయన అవార్డు అందుకున్నారు.
  • బెస్ట్‌ ప్రొడెక్షన్‌ డిజైన్‌ కేటగిరిలో అవార్డు అందుకున్న ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’ టీమ్‌.
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే అవార్డు అందుకున్న షెరా పాల్లే.