Oscars 2022: ఉత్త‌మ స‌హాయ న‌టిగా అరియానా డీబ్రోస్‌, వెస్ట్ సైడ్ స్టోరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటి
Oscar Winners 2020 List | Photo: Twitter

ఉత్త‌మ చిత్రంగా ‘కోడా’ నిలువ‌గా ఉత్త‌మ అంత‌ర్జాతీయ చిత్రంగా జపాన్‌కు చెందిన ‘డ్రైవ్ మై కార్’ నిలిచింది. ఉత్త‌మ న‌టుడిగా ‘విల్ స్మిత్(కింగ్ రిచార్డ్)’, ఉత్త‌మ డైరెక్ట‌ర్‌గా ‘జానే కాంపీయ‌న్(ది ప‌వ‌ర్ ఆఫ్ ది డాగ్)’ ఆస్కార్ అవార్డుల‌ను అందుకున్నారు. ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా ‘ట్రాయ్ కోట్సుర్‌కు(కోడా)’ ఆస్కార్ వ‌చ్చింది. ఉత్త‌మ స‌హాయ న‌టిగా ‘అరియానా డీబ్రోస్‌(వెస్ట్ సైడ్ స్టోరీ)’, ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ఫీచ‌ర్ విభాగంలో’ స‌మ్మ‌ర్ ఆఫ్ సోల్‌’కు ఆస్కార్ అవార్డు వ‌రించింది.