Kajol, Suriya (Photo Credits: Twitter)

ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం స్టార్‌ హీరో సూర్య, బాలీవుడ్ నటి కాజోల్‌కు దక్కింది. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యుడు, సభ్యురాలిగా వీరిద్దరు ఛాన్స్‌ కొట్టేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు వరల్డ్‌వైడ్‌గా 397 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో సూర్య, కాజోల్‌తోపాటు గతేడాది బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న రైటింగ్‌ విత్‌ ఫైర్‌ దర్శకులు సుస్మిత్‌ ఘోష్, రింటూ థామస్‌, ఇతర కళాకారులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఈ విషయాన్ని జూన్‌ 28న రాత్రి అకాడమీ బోర్డ్‌ ప్రకటించింది. బిల్ గేట్స్‌కి వినయం చాలా ఎక్కువన్న మహేష్ బాబు, భార్య నమ్రతతో కలిసి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను కలిసిన సూపర్ స్టార్

2022లో 44 శాతం మంది మహిళలు, 37 శాతం తక్కువ ప్రాతినిధ్యం ఉన్న జాతులకు చెందిన వారిని, 50 శాతం యూఎస్‌ఏకు వెలుపల 53 దేశాలు, భూభాగాలకు చెందిన వారిని తీసుకుంటున్నట్లుగా అకాడమీ తెలిపింది. కాగా సౌత్ ఇండియాతోపాటు కోలీవుడ్‌ నుంచి ఇలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నటుడిగా సూర్య గుర్తింపు పొందారు. సూర్య నటించిన 'జై భీమ్‌', 'ఆకాశం నీ హద్దురా' చిత్రాలు గతంలో ఆస్కార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంలో అవార్డును అందుకోలేకపోయాయి.