Hyderabad, September 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు కానుకగా ‘జల్సా’ (Jalsa) మళ్లీ సెప్టెంబర్ 1వ తేదీన (నేడు) విడుదలైంది. అయితే ఒక పెద్ద సినిమా ఎలా విడుదలవుతుందో.. అంత పెద్దగా ఈ సినిమా రీ రిలీజైంది. ముఖ్యంగా యువత ఈ సినిమా చూడటానికి ఎగబడుతున్నారు. ప్రసాద్ మల్టీప్లెక్స్‌ లో మొదటిరోజు ఒక పెద్ద సినిమా ఎలా వేస్తారో, అలానే ఈ ‘జల్సా’ సినిమాని కూడా 15 షోస్ వేశారు. ఇప్పటి వరకు మొత్తం 600కి పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమా నడుస్తోందని, ఫ్యాన్స్ ఇంకా కొన్ని షోస్ కావాలంటున్నారని, అందుకని శుక్రవారం కూడా కొన్ని షోస్ వేసే అవకాశం ఉందని, పవన్ కళ్యాణ్ ఫాన్స్ అసోసియేషన్ ప్రతినిధి ప్రదీప్ రెడ్డి (Pradeep Reddy) చెప్పారు.

‘ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తా’-పవన్ పవర్ అంటే ఇది

ఇప్పటి వరకు.. సుమారు 4 కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసిందని, ఇంకా మరికొన్ని ప్రాంతాల నుండి కలెక్షన్ల సమాచారం రావాలని చెప్పారు. ఈ షోస్ ద్వారా వచ్చిన డబ్బంతా.. పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర (Koulu Rythu Bharosa Yatra)లో రైతులకి చేస్తున్న సహాయానికి ఇచ్చేస్తామని చెప్పారు. పోకిరి రికార్డులను జల్సా బద్దలు కొట్టినట్టు పేర్కొన్నారు.