People magazine names American singer John Legend as 2019 ‘Sexiest Man Alive’(Photo-Twitter)

November 14: ప్రముఖ మ్యాగజైన్ ఈ ఏడాది మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌‌ ఎవరనే విషయాన్ని ప్రకటించింది. ప్రముఖ హాలీవుడ్‌ సింగర్‌ జాన్‌ లెజెండ్‌ (John Legend) ఈ ఏడాదికి గాను ‘మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌’(Sexiest Man Alive)గా నిలిచాడు. ఇప్పటికే తన పాటలతో జనాలను ఉర్రూతలూగించిన ఈ పాప్‌ సింగర్‌ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన ట్విట్టర్ అకౌంట్లో వావ్ థాంక్యూ పీపుల్ మ్యాగజన్ అంటూ తన ఫోటోతో కూడిన పీపుల్ మ్యాగజైన్ కవర్ పేజిని ట్వీట్ చేశాడు.

ఈ సందర్భంగా జాన్‌ లెజెండ్‌ మాట్లాడుతూ.. ‘ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ఇడ్రిస్‌ ఎల్బా(2018) తర్వాత నేను ఈ అవార్డును పొందడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ అవార్డుతో నాలో ఒత్తిడి పెరిగింది. ఈ అవార్డు అందుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను.

అదేవిధంగా కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే అంత సెక్సీమెస్ట్‌ మ్యాన్‌గా ఉన్నానా లేదో అనుమానం కలుగుతోంది. అయితే ఈ విషయంలో గతేడాది విన్నర్‌గా నిలిచిన ఇడ్రిస్‌ ఎల్బాను అనుసరిస్తాను’అని జాన్‌ లెజెండ్‌ పేర్కొన్నారు.

జాన్ లెజెండ్ ట్వీట్

లెజెండ్ 10 సార్లు గ్రామీ విజేత(Grammy winner)గా నిలిచాడు. 40 ఏళ్ల లెజెండ్ "సెల్మా"("Selma) చిత్రంలో "గ్లోరీ" (Glory) పాటను సహ-రచన చేసినందుకు గాను 2015 లో ఆస్కార్ సాధించాడు. అలాగే "జిట్నీ" లో సహ-నిర్మాతకు గానూ టోనీ అవార్డును గెలుచుకున్నాడు.

2018 విన్నర్

అంతేకాకుండా ఎన్ బీసీలో లైవ్ వర్షన్ ( NBC's live version)లో వచ్చిన "జీసస్ క్రిస్ట్ సూపర్ స్టార్" (Jesus Christ Superstar,) ప్రాజెక్ట్ లో యేసు పాత్రను కూడా పోషించాడు. దీనికి ఎమ్మి (Emmy) నిర్మాతగా ఉన్నారు