Hoax Bomb Threat: రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు, అణువణువునా గాలించిన బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌ బృందాలు, ఫోన్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Rajinikanth (Photo Credits: IANS) ..

Chennai, June 19: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు (Rajinikanth hoax bomb threat) వచ్చింది. పోయిస్ గార్డెన్స్‌లోని రజనీ ఇంట్లో బాంబు పెట్టామని అది ఏ క్షణమైనా పేలుతుందని ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ (bomb threatening call) రావడంతో పోలీసులు పరుగు పరుగున తలైవా ఇంటికి చేరుకున్నారు. బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌తో అణువణువునా గాలించారు. అయితే ఎక్కడా బాంబు ఆచూకీ లేకపోవడంతో ఫేక్ కాల్‌గా గుర్తించారు. ఇద్దరి అగ్ర హీరోల ఫ్యాన్స్ వివాదం, ఒకరిని హత్య చేసిన మరొకరు, నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించిన మరకనం పోలీసులు

ఎవరో కావాలనే ఇలా అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని, రజనీ (Tamil Superstar Rajinikanth) ఇంట్లో గానీ ఇంటి పరిసరాల్లో గానీ బాంబు లేదని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో సదరు ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే గతేడాది కూడా ఇలాగే రజనీకాంత్ ఇంట్లో బాంబ్ ఉందంటూ ఫేక్ కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు.. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని నిర్థారించారు. దుమ్మురేపుతోన్న రజినీకాంత్ సాహసాలు

మళ్ళీ ఇప్పుడు అదే స్టైల్‌లో ఎవరో బాంబ్ కలకలం సృష్టించడం జనాల్లో చర్చనీయాంశం అయింది. మరోవైపు ఈ మధ్యే తమిళనాడు సీఎం పళనిస్వామి ఇంట్లో కూడా బాంబ్ ఉందని బెదిరింపు కాల్ రావడంతో అది ఫేక్ కాల్ అని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో ఇలాంటి ఫేక్ కాల్స్, వాట్సాప్ సందేశాలను సీరియస్‌గా తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా కొందరు ఆకతాయిలు ఏ మాత్రం భయపడకుండా అదే పని పెట్టుకున్నారు.కాగా తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి కాల్స్ పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు.