Rakesh Master (PIC@ Twitter)

Hyderabad, June 29: ఇటీవల ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ (Rakesh Master) అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో డ్యాన్సరస్ లో విషాదం నెలకొంది. ఆయన అంత్యక్రియలకు అనేకమంది డ్యాన్స్ మాస్టర్స్ వచ్చి నివాళులు అర్పించారు. తాజాగా బుధవారం నాడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ శిష్యులు.. శేఖర్, సత్య మాస్టర్స్ తో పాటు డ్యాన్స్ యూనియన్స్ (Dance Unioun) ఆధ్వర్యంలో రాకేష్ మాస్టర్ సంతాప సభ నిర్వహించారు. ఈ సంతాప సభలో పలువురు సినీ ప్రముఖులు, డ్యాన్స్ మాస్టర్లు, డాన్సర్స్ మరియు రాకేష్ మాస్టర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాకేష్ మాస్టర్ భార్య తండ్రి, ఆయన మామయ్య మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అయన కూడా సినిమా ఇండస్ట్రీనే అని, ఒకప్పుడు రాకేష్ మాస్టర్ ఎంతో కష్టపడ్డారని, సినిమా కోసం, యూనియన్స్ కోసం చాలా చేశారని చెప్పారు.

Producer T.R.Chandrashekhar: మత్తుకు బానిసై నా భార్య వేరేవాడితో తిరుగుతోంది, పోలీసులకు ప్రముఖ నిర్మాత చంద్రశేఖర్ ఫిర్యాదు, ఎదురు కేసు పెట్టిన భార్య నమిత 

అలాగే రాకేష్ మాస్టర్.. ఒక సంవత్సరం క్రితం నాకు ఒక ఖాళీ స్టాంప్ పేపర్ మీద సైన్ చేసి తీసుకొచ్చి ఇచ్చి ఒక ఛానల్ ఉందని, ఆ ఛానల్ లో నీకు కూడా వాటా ఉందని, ఒకవేళ నేను ముందు పోతే నా కుటుంబాన్ని నువ్వు చూసుకో, ఆ ఛానల్ వాటా నువ్వు తీసుకో, దీంట్లో నీకు ఎలా కావాలంటే అలా రాసుకో అంటూ ఈ పేపర్స్ ఇచ్చాడు. నాకు ఆస్తి అవసర్లేదు, అది మొత్తం వాళ్ళ పిల్లలకే ఇస్తాను, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటాను, నాకు అభిమానం చాలు, ఇంతమంది రాకేష్ మాస్టర్ ని అభిమానిస్తున్నారు అంటూ ఎమోషనల్ అయి ఆ పేపర్స్ చించేశారు. ఆయన కోసం ఇచ్చిన ఆస్తి వాటాని కూడా వద్దనుకుని పేపర్లు చింపేయడంతో అక్కడ ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యపోయి ఆయన్ని అభినందించారు.