
Hyderabad, NOV 09: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ‘గేమ్ ఛేంజర్ టీజర్ (Game Changer Teaser) ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు తీపికబురునందిస్తూ.. టీజర్‌ను విడుదల చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ – శంకర్ – దిల్ రాజు (Dill Raju) ట్రయోలో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ చేసిన టీం తాజాగా టీజర్ కోసం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఇక ఈ వేడుకలో రామ్ చరణ్‌తో పాటు కియార అద్వానీ(Kiara Advani), దిల్ రాజు ఫ్యామిలీ, తదితరులు హాజరై సందడి చేశారు.
Ram Charan-Kiara Advani's ‘Game Changer’ Teaser
బేసిక్‌గా రామ్ అంతా మంచోడు లేడు. కానీ వాడికి కోపం వస్తే.. వాడి అంతా చెడ్డోడు ఇంకొకడు ఉండడు అంటూ మాస్ డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఇక గేమ్ ఛేంజర్ టీజర్ చూస్తుంటే.. రామ్ చరణ్ ఇందులో స్టూడెంట్‌గా, ప్రజల నేతగా, ఆఫీసర్‌గా రాజకీయ నాయకుడిగా నాలుగు పాత్రల్లలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా.. ఫస్ట్ టైం రామ్ చరణ్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్నాడు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా సాగిన ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి.