ram-gopal-varma-amma-rajyam-lo-kadapa-biddalu-cinema-gets-green-signal (Photo-Twitter)

Hyderabad, December 7: కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) నిర్మిస్తున్న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు (Amma Rajyamlo Kadapa Biddalu)సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు (Censor Board)రివైజింగ్ కమిటీ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలను కత్తిరిచిన సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ను జారీచేసినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా విడుదల తేదీని వర్మ ప్రకటించారు.

తొలుత ఈ సినిమాకు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు (Kamma Rajyam Lo Kadapa Reddlu) అన్నటైటిల్ ను నిర్ణయించారు. సినిమా కథనంతో పాటు దీని టైటిల్ ను సవాల్ చేస్తూ..కోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టు ఆదేశాలమేరకు సెన్సార్ బోర్డు సినిమాను చూసి పరిశీలనాంశాలను తెలపాలని కోరిన విషయం తెలిసిందే.

Ram Gopal Varma Twitter

హైకోర్టు వరకు విషయం వెల్లడంతో వర్మ సినిమాకు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని టైటిల్‌ను మార్చారు. డైరెక్ట్‌గా ప్రస్తుత రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ సినిమాను చూపించడంతో అనేక వివాదాలకు సినిమా కేంద్ర బిందువుగా మారింది. సినిమాలో కేఏపాల్‌ను మరీ జోకర్‌గా చూపించడంతో ఆయన వర్మపై కేసు వేశారు. తాను ఎవరినీ ఉద్దేశించి పాత్రలు రూపొందించలేదని ఎంత చెప్పినా, వర్మ అసలు ఉద్దేశం ఏంటో అందరికీ తెలిసిందే.

ఇప్పటికే సెన్సార్‌ బోర్డ్‌ పై రాంగోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. `మేం ఎలాంటి సినిమాలు చూడాలో వారు ఎలా నిర్ణయిస్తారు. నన్ను ఎంత తొక్కితే అంత రెచ్చిపోతా. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సీక్వెల్‌ కూడా తీస్తా` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Ram Gopal Varma Twitter

మొత్తానికి వర్మ ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘‘మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పటికీ ఉందని అర్థమైంది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ పూర్తి అయ్యింది. డిసెంబర్ 12న ఈ చిత్రం రాబోతోంది’’ అని ట్వీట్ చేశాడు. వెంటనే మరో ట్వీట్‌లో ‘‘సారీ సారీ సారీ.. అలవాటులో పొరపాటు.. నా ఉద్దేశ్యం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’’ అని వర్మ పేర్కొన్నాడు.