RGV says, It's pointless to ask brutal punishment for Hyderabad Vet's rapists and murderers (Photo-Twitter)

తెలుగు చిత్ర సీమలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు (Varma on Talibans) ఏం చేస్తున్నారో చూడండి అంటూ కొన్ని వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తాలిబన్ల కబంద హస్తాల్లో చిక్కున్న ఆఫ్గనిస్తాన్ పరిస్థితులపై వర్మ రియాక్ట్ స్పందిస్తూ ఈ వీడియోలను పోస్ట్ చేశారు. చేతిలో ఆయుధాలు పట్టుకొని అధ్యక్ష భవనంలో జల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించిన వీడియోని షేర్‌ (Ram Gopal Varma Share in Twitter) చేస్తూ.. వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని ట్వీట్‌ చేశాడు.

అలాగే కాబూల్‌లోని ఓ ఎమ్యూజ్‌మెంట్ పార్కుకి వెళ్లిన తాలిబన్లు అక్కడ ఎలక్ట్రిక్ బంపర్ కార్లలో కూర్చొని చిన్న పిల్లలా రైడింగ్ చేస్తూ, ఆడుకుంటూ కేరింతలు కొడుతున్న వీడియో (Taliban’s behavior videos ) షేర్ చేస్తూ.. 'ఇది నిజం.. తాలీబన్స్ జస్ట్ కిడ్స్' అంటూ ఆర్టీజీ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.20 ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని తాలిబన్లు పది రోజుల్లోనే ముగించేశారు. అఫ్ఘానిస్తాన్‌లోని కీలక పట్టణాలన్నింటినీ క్రమంగా ఆక్రమించుకుంటూ వచ్చి రాజధాని కాబూల్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు.

Here's Ram Gopal Varma Tweets

ఈ నగరం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ ఉగ్రవాదుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. కాబూల్ విమానాశ్రమం ఒక్కటి మాత్రమే అమెరికా సైన్యం ఆధీనంలో ఉంది. దీంతో అక్కడి నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర విదేశాలకు పారిపోయేందుకు అఫ్ఘానిస్తాన్ ప్రజలు సిద్ధమయ్యారు. దీంతో కాబూల్ వినామాశ్రయం జనసంద్రంగా మారింది. అక్కడ కనిపిస్తున్న భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.