Varma vs Pawan Kalyan Fans: పవర్ స్టార్ వర్సెస్ పరాన్న జీవి, ట్విట్టర్ వేదికగా ముదిరిన యుద్ధం, వర్మను కుక్కతో పోల్చిన హీరో నిఖిల్, ఆ నిఖిల్..కిఖిల్ ఎవడో తెలియదంటూ వర్మ రివర్స్ కౌంటర్
power star vs paranna jeevi Posters ( Photo-Twitter)

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ‘పవర్‌ స్టార్‌’ అనే సినిమా చేయబోతున్నట్లు ట్వీటర్‌ వేదికగా ప్రకటించి సంచలనం రేపిన సంగతి విదితమే. అయితే ఆ ప్రకటన వచ్చినప్పటి నుంచి ట్విట్టర్ వేదికగా వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ (Varma vs Pawan Kalyan Fans) అన్నట్లుగా వార్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ (Pawan Kalyan Fans) వర్మపై విరుచుకుపడుతుండగా వర్మ ఫ్యాన్స్ (Varma Fans) గబ్బర్ సింగ్ అభిమానుల మీద విరుచుకుపడుతున్నారు.

వర్మ పవర్ కళ్యాణ్ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ (Power Star Movie) అని పేరు పెట్టాం. ఇందులో పీకే, ఎమ్‌ఎస్, ఎన్‌బీ, టీఎస్, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవడానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. ఓ వ్యక్తి వీడియోను కూడా విడుదల చేసి, ‘‘నా ‘పవర్‌ స్టార్‌’ చిత్రంలో నటించే హీరో ఇతనే. అతను మా కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ షాట్‌ చిత్రీకరించాం. ఇతన్ని ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తే అది యాధృచ్చికమే’’ అని కూడా వర్మ ట్వీట్‌ చేశారు. అక్కడి నుంచి వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి.

ఆర్జీవీ దగ్గర కథలు అయిపోవడంతోనే నిజ జీవిత కథలు, సంఘటనలపై పడ్డారని పలువురు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ‘నా కాలేజీలో జరిగిన కథనే శివ. గాయం, సర్కార్‌, సత్య, కంపెనీ, రక్తచరిత్ర ఇవన్నీ నిజ జీవిత కథల ఆధారంగానే తెరకెక్కించిన చిత్రాలు. నా మొత్తం సినీ కెరీర్‌లో 70 శాతం చిత్రాలు సమాజంలో జరిగిన ఘటనలు, నిజ జీవిత అనుభవాల ఆధారంగానే తెరకెక్కించాను. మరికొన్ని ఇంగ్లీష్‌ నవలలు, ఫారిన్‌ చిత్రాల నుంచి కాపీ కొట్టాను’ అంటూ ఆర్జీవీ కుండబద్దలు కొట్టి చెప్పారు. ప్రస్తుతం ఆర్జీవీ వారికి సమాధానం ఇచ్చారు.

RGV Tweets

వివాదాలు ఎన్ని వచ్చినా వర్మ తన ప్రయత్నాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి "గ‌డ్డి తింటావా?" (Power Star's Gaddi Tintava Song) అనే పాటను యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ఈ పాట‌లో హీరో త‌న గేదెలు, మొక్క‌ల‌ను ఉద్దేశిస్తూ పాడతాడ‌ని ఆర్జీవీ పేర్కొన్నారు. పనిలో పనిగా వర్మ ‘ప‌వ‌ర్ స్టార్’ సినిమాలో ఓ క్యారెక్టర్‌ అంటూ... అతడు ఎవరి పోలికతో అయినా ఉన్నాడా అంటూ ట్వీట్‌ చేశారు. ఇక ఈ సినిమా ట్రైల‌ర్ జూలై 22న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేశారు. అది అటు నెగిటివ్ లైకులు, పాజిటివ్ లైకులతో దూసుకుపోతోంది. జూలై 25న ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో సినిమా విడుద‌ల కానుందని మరో ట్వీట్ చేసి వివాదాన్ని మరింతగా వర్మ పెంచారు.

ఇక పవన్ ఫ్యాన్స్ రామ్‌గోపాల్‌ వర్మపై (Ram Gopal Varma) సెటైరికల్‌గా ఓ చిత్రం రూపొందించే పనిలో పడ్డారు. ఈ చిత్రానికి ‘పరాన్నజీవి’ (Parannageevi First Look) అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేశారు. తాజాగా ఈ చిత్రంపై నటి శ్రీరెడ్డి స్పందించారు. తనను ఈ సినిమాలో నటించాల్సిందిగా చాలా ఒత్తిడి వచ్చిందని.. కానీ అందుకు అంగీకరించలేదని శ్రీరెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే తనకు రామ్‌గోపాల్‌ వర్మ అంటే ఇష్టమని చెప్పారు. తనకు కొన్ని విలువలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

ఈ పరిస్థితులు ఇలా నడుస్తుంటే.. ‘పవర్‌ స్టార్‌: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ’ సినిమా ట్రైలర్‌ లీకైందని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వెల్లడించారు. దీని వెనుక తన ఆఫీస్‌ స్టాఫ్‌ హస్తం ఉందని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను వీక్షించేందుకు డబ్బు చెల్లించిన వారికి ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఏదేమైనా తాను ఇప్పుడు ఏం చేయలేనని, యూట్యూబ్‌లో హై రిజల్యూషన్‌ వర్షన్‌లో ట్రైలర్‌ను విడుదల చేయడమే తన ముందున్న మార్గమని పేర్కొంటూ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. అదే విధంగా ‘గడ్డి తింటావా సాంగ్‌’ 20 లక్షల వ్యూస్‌ సాధించినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్రైలర్ విడుదల కాగానే పవన్ ఫ్యాన్స్ పరాన్నజీవి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘రెక్‌లెస్‌ జెనెటిక్‌ వైరస్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌ తో ఈ ఫస్ట్ లుక్ విడుదలైంది. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-2 కంటెస్టెంట్‌ నూతన్‌ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 99 థియేటర్‌ బ్యానర్‌పై సీఎస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Here's Parannajeevi best first look 

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ను చిత్ర బృందం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ చిత్రంలో లీడ్‌ పాత్రలో జబర్దస్త్‌ కమెడియన్‌ షకలక శంకర్‌ నటిస్తున్నారు. పరాన్న జీవి ఫస్ట్‌ లుక్‌లో.. ఆర్జీవీ పాత్ర ఓ నటిని‌ డైరెక్ట్‌ చేస్తున్న స్టిల్‌ చూపెట్టారు. ఈ చిత్రాన్ని జూలై 25న 11 గంటలకు శ్రేయాస్‌ ఈటీలో విడుదల చేయనున్నట్టు పవన్ ఫ్యాన్స్ ప్రకటించారు.

Here's Varma Tweet

ఈ నేపథ్యంలో తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయినా సమస్యేమీ లేదని, తానెప్పుడూ బెదిరింపుల మధ్యే జీవించానని పేర్కొన్నారు. తన స్టార్‌ పవర్‌ స్టార్‌ కన్నా పవర్‌ఫుల్‌గా ఉందని, బస్తీమే సవాల్‌ అంటూ సవాలు విసిరారు.

ఇప్పుడు తాజాగా నిఖిల్ ట్విట్టర్ వేదికగా వర్మపై (RGV vs NIKHIL) విరుచుకుపడ్డారు. వ‌ర్మ పేరెత్త‌కుండానే ఆయ‌న్ని కుక్క‌తో పోల్చుతూ మండిప‌డ్డారు. "శిఖ‌రాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మ‌హాశిఖ‌రం త‌ల తిప్పి చూడ‌దు. మీకు అర్థం అయిందిగా.." అంటూ ట్వీట్ చేశారు. దీనికి ప‌వ‌న్ కళ్యాణ్, ప‌వ‌ర్ స్టార్ హ్యాష్‌ట్యాగ్‌ల‌ను జోడించారు. దీంతో వ‌ర్మ‌కు తిక్క కుదిరిందంటూ ప‌వ‌న్ అభిమానులు సంతోష‌ప‌డుతుంటే వారి ఆనందాన్ని ఆవిరి చేస్తున్నారు మ‌రికొంద‌రు నెటిజ‌న్లు. 'అవును.. శిఖరం అంటే 120 స్థానాల్లో డిపాజిట్ గ‌ల్లంతు అవ‌డం ఏమో అనుకుంట‌', 'ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ఫ్ల‌వ‌ర్ స్టార్ అయ్యాడు. అభిమానుల‌కు పెద్ద కాలీఫ్ల‌వ‌ర్ పెడ‌తాడు' అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

Here's Nikhil Siddhartha Tweet

నిఖిల్ సిద్ధార్థ్ కు వర్మ గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. బుధ‌వారం ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న అస‌లు నిఖిలెవ‌రో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. "నిఖిల్ అయినా, కిఖిల్ అయినా అంద‌రూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కింద‌ తొత్తుల్లా ఉంటారు. ఇలా తొత్తుల్లా ఉంటే ప‌వ‌న్‌కు వీరిమీద‌ మంచి అభిప్రాయం ఏర్ప‌డుతుంద‌ని వాళ్ల ఆశ‌. అది బానిస‌త్వం అనే బుద్ధిలో నుంచి వ‌చ్చే ఆశ‌. కానీ నాకు నిఖిలెవ‌డో తెలీదు. అత‌నో పెద్ద స్టార్ అయిండొచ్చు. కానీ నాకు మాత్రం తెలీద"ని చెప్పుకొచ్చారు.

వర్మ ఫ్యాన్స్ కూడా తానేమీ తక్కువ కాదంటూ వర్మకు జై కొడుతున్నారు. ‘ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావ్.. వర్మతో పెట్టుకోవడం నీకు అవసరమా నిఖిల్ (Nikhil Siddharth).. బ్రదర్ నువ్ అంటే అభిమానం నాకు, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు.. ఇదే వర్మ పెద్ద ఎన్టీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు సినిమాలో చూపిస్తే మాట్లాడలేదు.. కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో బాలయ్య బాబు బిడ్డని నెగటివ్‌గా చూపిస్తే మాట్లాడలేదు ఎందుకు?

నీకు పవన్ ఫాన్స్ చాలా వేరే హీరో ఫాన్స్ అవసరం లేదా? ఇంతకీ ఇక్కడ కుక్క ఎవరూ?పావలనా లేక జీవినా? తెలుగోడు సత్తా ప్రపంచానికే చాటిన మన అన్న ఎన్టీఆర్ గారి మీద సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు మొరిగె కుక్కలు అప్పుడు మొరగలేదే? కలికాలం ఆంటే ఇదే మరి? నువ్వేమో ప్రచారం చేసింది టీడీపీ తరుపున ఇప్పుడేమో పవన్ కళ్యాణ్‌ని శిఖరం అంటున్నావ్.. అయినా వర్మతో నీకెందుకు ఆయన్ని కెలక్కు సామీ. నిక్కర్‌లో నిఖిల్ అని ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తాడు.. తరువాత నువ్ పిసుక్కోవడమే.. పిల్లోడివి పిల్లోడిలా ఉండవయ్యా నిఖిల్ అంటూ ఓ రేంజ్‌లో వర్మ అభిమానులు నిఖిల్‌పై కామెంట్స్ చేస్తున్నారు . అయితే వర్మ ఫ్యాన్స్‌కి గట్టి కౌంటర్స్ ఇస్తూ నిఖిల్‌కి మద్దతుగా నిలుస్తున్నారు పవన్ అభిమానులు.

ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నట్లుగా తయారైంది. దీనికి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందనేది తెలియడం లేదు. రెండు సినిమాలు జూలై 25న విడుదల కానున్నాయి. అప్పుడు కాని దీనికి తెరపడేలా కనపడటం లేదు.