Rangasthalam comedian mahesh (Photo-Twitter)

జబర్దస్త్ కామెడీ షో ద్వారా నవ్వించి రంగస్థలం సినిమాలో నటనతో మరితం ఫేమ్ తెచ్చుకున్న మహేష్ (Jabardasth Comedian Mahesh) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. యాత్ర మూవీలో కూడా మంచి పాత్రను పోషించి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న మహేశ్ (Rangasthalam comedian mahesh ) తన జీవితంలో పడ్డ కష్టాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

ఇంటర్యూలో మాట్లాడుతూ..తనకు పేరు ఒక్క రోజులో వచ్చింది కాదని చెప్పారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జీరో. టాలెంట్ నమ్ముకొని వచ్చా. ఏం జరిగినా ముందుకెళ్లడమే నాకు తెలుసు. నాకు చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని హైదరాబాద్‌కు వచ్చా. సినిమాలనే నమ్ముకున్నా. నేను సినిమాలలో ప్రయత్నాలు చేస్తున్నప్పుడే నాన్న చనిపోయారు.

స్త్రీలు తమ శరీరాలను దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పుకుంటే అంత మంచిది, సల్మాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

ఆ సమయంలో నాన్న చితి కట్టెలకు కూడా డబ్బులిచ్చే స్తోమత లేదు. అప్పుడు నా జేబులో రూ.500 కూడా లేవు. అప్పుడు చాలా బాధేసింది. ఆ సమయంలో ఈ బతుకు ఎందుకురా అనిపించింది. దీంతో చాలామంది బంధువులు, స్నేహితులు..నీకు సినిమాలు అవసరమా అంటూ నన్ను తిట్టారు. ఆ సందర్భంలో నేను మాత్రం చాలా బాధపడ్డా. డైరెక్టర్ సుకుమార్ నాకు మంచి అవకాశం ఇచ్చారు. కొన్నేళ్లు పట్టినా కూడా మంచిపాత్ర చేసే అవకాశం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఇల్లు లేదని.. సొంతూళ్లో ఇటీవలే ఇంటిని నిర్మించానంటూ మహేశ్ తీవ్ర భావోద్వాగానికి గురయ్యాడు.