టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కరోనా వలన పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు మార్చి 25న విడుదలయ్యేందుకు సిద్దమైంది. సంక్రాంతికి రావల్సిన ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ చేసిన ఒమిక్రాన్ వలన చివరి నిమిషంలో వాయిదా వేశారు. మార్చి నుండి చిత్రానికి ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది.
మార్చి తొలివారం నుంచే ప్రమోషన్స్ షురూ చేయాలని రాజమౌళి టీమ్ డిసైడ్ అయిందట. ఈ మేరకు దుబాయ్‌లో ధూం ధాం చేసేందుకు జక్కన్న టీమ్ ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోందట. ఈ వేడుక మునుపెన్నడూ చూడనివిధంగా చాలా గ్రాండ్‌గా ఉండాలని భావిస్తున్నారట రాజమౌళి. ఈ కార్యక్రమానికి ఓ హాలీవుడ్ సూపర్ స్టార్‌ని ముఖ్య అతిథిగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
అన్ని హంగులతో మార్చి 15న ఈ ఈవెంట్ జరగబోతోందని సమాచారం. నిజానికి దుబాయ్ ఈవెంట్ ఎప్పుడో ప్లాన్ చేశారు రాజామౌళి. కానీ.. వాయిదాలు పడి చివరికి మార్చి నెలకు పోస్ట్ పోన్ అయింది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించగా.. అల్లూరి సీతారామరాజు రోల్‌లో రామ్ చరణ్ కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్, శ్రీయ కీలకపాత్రలు పోషించారు.
దుబాయ్ లో కనీవినీ ఎరుగని రేంజ్ లో మార్చి 15న ఓ భారీ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ను తీసుకొచ్చి వరల్డ్ వైజ్ గా క్రేజ్ ని తీసుకురావాలన్న ప్లాన్ తో ఉన్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతుండగా అదే నిజమైతే ఇలా ఇతర దేశాలలో హాలీవుడ్ చీఫ్ గెస్ట్ తో ఈవెంట్ చేసిన తెలుగు సినిమా ఘనత ఆర్ఆర్ఆర్ కి దక్కనుంది.