Salman Khan Gets Fresh Death Threats: సల్మాన్‌ ఖాన్‌‌ను చంపేస్తామని బెదిరింపు మెయిల్, అలర్ట్ అయిన ముంబై పోలీసులు, నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం
Salman Khan (Photo Credits: Yogen Shah)

బాలీవుడ్‌ (Bollywood) నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)కు మరోసారి బెదిరింపులు (threat email) వచ్చిన విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ (gangsters Lawrence Bishnoi) గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌కు ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు (threat email) వచ్చాయి. దీనిపై ముంబయి (Mumbai) లోని బాంద్రా (Bandra) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రజనీకాంత్ కూతురు ఇంట్లో దొంగతనం, 60 సవర్ల నగలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐశ్వర్య రజనీకాంత్‌

దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనకు భద్రత పెంచారు. మరోవైపు నటుడి నివాసం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.సల్మాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు రావడం ఇది మొదటిసారేం కాదు. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా సల్మాన్‌ఖాన్‌ బిష్ణోయ్‌ల మనోభావాలను దెబ్బతీశారంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యాఖ్యానించాడు. నటుడిని చంపేస్తామంటూ ప్రకటించాడు.